అనుపమ ట్వీటింది.. టార్గెట్ చెర్రీనేనా..?

0
335
anupama tweet target ramcharan and sukumar

Posted [relativedate]

anupama tweet target ramcharan and sukumar
అనుపమ పరమేశ్వరన్.. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ పేరు ఓ రేంజ్ లో మోగిపోతోంది. నితిన్ తో అ..ఆ, చైతుతో చేసిన ప్రేమమ్.. శర్వాకి జోడీగా నటించిన శతమానం భవతి సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించిన ఈ మళయాళీ భామకు వరుస అవకాశాలు వచ్చాయి.

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా అవకాశం కొట్టేసింది. అయితే వరుస విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో అను తన రెమ్యునరేషన్‌ ను భారీగా పెంచేసింది. దీంతో ఆ చిత్ర యూనిట్ ఆమెను తప్పించి వేరే కొత్త హీరోయిన్‌ కోసం వెతుకుతోందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా తాజాగా అనుపమ చేసిన ట్వీట్ చూస్తే మాత్రం ఆ ఊహాగానం నిజమనే అనుకోవాలని, చెర్రీని, సుకుమార్ ని టార్గెట్ చేస్తూ ఆమె ట్వీట్‌ చేసిందని సినీ వర్గాలతో పాటు అభిమానులు కూడా చెప్పుకుంటున్నారు.

ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. నా జీవితాన్ని నేను వెనుతిరిగి చూసుకుంటే.. ఏదైనా మంచి అవకాశం నా చేజారి పోయిందంటే.. అంతకంటే మంచి అవకాశం వైపు నా దారి మళ్లుతోందని అర్ధమవుతోందని ఆ ట్వీట్ సారాంశం. అయితే ఈ ట్వీట్ లో చెర్రీ, సుకుమార్ ల పేర్లు లేకపోయినా ఏ సందర్భం లేకుండా అనుపమ ఈ రకమైన ట్వీట్ చేసిందంటే, ఆమె చెర్రీ, సుకుమార్ లనే టార్గెట్ చేసిందనుకుంటున్నారు అభిమానులు.

Leave a Reply