Posted [relativedate]
స్వీటీ అనుష్క పెళ్లికి సంబందించిన వార్తలు రోజుకో రకంగా బయటకు వస్తున్నాయి. 35 ఏళ్ళ అనుష్క పెళ్లికి రెడీ అన్న సంకేతాలివ్వడంతో ఇంట్లో వారు పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మొన్నటిదాకా అనుష్కను పెళ్లి చేసుకోబోయేది ఓ తెలుగు నిర్మాత వ్యాపాతవేత్త అని ఒకటే హడావిడి చేశారు. అయితే అనుష్క చేసుకునేది బిజినెస్ మెన్ అని కన్ఫాం అయ్యింది కాని అనుకున్నట్టు తెలుగు నిర్మాత కాదట. బెంగుళూరులో బడా బిజినెస్ మేన్ గా ఉన్న అతను అనుష్క ఫ్యామిలీకి చాలా సన్నిహితుడట.
అందుకే అనుష్కను అతనికిచ్చి పెళ్లి చేసేద్దాం అని ఫిక్స్ అయ్యారట. ఇక అతని బిజినెస్ చేసేది బెంగుళూరులో అయినా ఆంధ్రాలో కూడా మంచి బిజినెస్ మేన్ గా గుర్తింపు ఉందట. ఓ రకంగా ఆయన ఆస్తులన్ని ఆంధ్రాలోనే ఉన్నాయని తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే అనుష్క ఆంధ్రా కోడలైనట్టే అని అంటున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న అనుష్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.
ప్రస్తుతం త్వరలో సూర్య ఎస్-3 తో రాబోతున్న అనుష్క బాహుబలి-2 లోనూ కనిపించనుంది. ఇక ఇవే కాకుండా తనే లీడ్ రోల్ లో చేస్తున్న భాగమతి సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఇక కమిట్ అయిన సినిమాలన్ని పూర్తి చేసుకుని అనుష్క సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని నిర్ణయించుకుందట. ఇదో రకంగా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.