వచ్చేనెలలో మళ్లీ రాబోతున్న దేవసేన

0
432
anushka bhagmati movie details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

anushka bhagmati movie details
‘బాహుబలి 2’ సినిమాలో దేవసేనగా నటించి మెప్పించిన అనుష్క మరో సినిమాతో సిద్దం అవుతుంది. ‘బాహుబలి 2’ చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న నేపథ్యంలో ఆ సక్సెస్‌ క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు అనుష్క నటిస్తున్న ‘భాగమతి’ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభాస్‌ సన్నిహితులు వంశీ మరియు ప్రమోద్‌లు యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనుష్క ప్రధాన పాత్రలో అశోక్‌ దర్శకత్వంలో ‘భాగమతి’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

సినిమా ప్రారంభం అయిన తర్వాత ఇప్పటి వరకు ‘భాగమతి’కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెలో ప్రభాస్‌ చేతు మీదుగా ‘భాగమతి’ వేడుక జరిపి ఫస్ట్‌ుక్‌తో పాటు, టీజర్‌ను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట ఇదో ఛారిత్రాత్మక నేపథ్య ఉన్న సినిమా అని భావించారు. అయితే ఇదో రివేంజ్‌ థ్రిల్లర్‌ అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టులో సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయి. ‘బాహుబలి’ తర్వాత అతి తక్కువ సమయంలోనే అనుష్క భాగమతిగా రానున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా రావడం ఖాయం.

Leave a Reply