అనుష్క ఫ్యాన్స్ కు పండుగే అట..!

0
663
Anushka Fans Satisfy With Bahubali-2

Posted [relativedate]

Anushka Fans Satisfy With Bahubali-2టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క లాస్ట్ ఇయర్ బాహుబలి, సైజ్ జీరోలలో ఫ్యాన్స్ ను నిరాశ పరచింది. బాహుబలి సూపర్ హిట్ కాని అనుష్క మాత్రం ఓల్డ్ క్యారక్టర్ లో కనిపించింది. రానున్న బాహుబలి-2 లో మాత్రం అనుష్క అందాలు కూడా హైలెట్ గా నిలవనున్నాయట. సైజ్ జీరో కోసం బాగా లావెక్కిన అనుష్క బాహుబలికి సంబందించిన షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. బరువు తగ్గించిన అనుష్క మళ్లీ ఎప్పటిలానే తయారయ్యిందట.

ఇక పార్ట్-2 లో అనుష్క ఫ్యాన్స్ కోసం ప్రభాస్, అనుష్కల మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ప్లాన్ చేశాడట రాజమౌళి. బాహుబలి బిగినింగ్ లో పచ్చబొట్టేసిన సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అదే తరహాలో అనుష్క సాంగ్ కూడా ఉంటుందట. ఈ దెబ్బతో అనుష్క మీద ఉన్న అన్ని రూమర్స్ చెల్లా చెదురవుతాయని అంటున్నారు. అదే కాకుండా సూర్య నటించిన సింగం-3 లో కూడా అనుష్క హీరోయిన్ గా నటించింది. శృతి హాసన్ సెకండ్ హీరోయిన్ గా ఉన్న ఈ సినిమాలో అనుష్క సన్నబడ్డదో లేదో తెలుస్తుంది. డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా భారీ క్రేజ్ దక్కించుకుంది.

Leave a Reply