స్వీటీ పెళ్లి కబర్.. వరుడు హైదరాబాదీ !

 Posted October 20, 2016

anushka ready to get marriageముద్దుగుమ్మ అనుష్క పెళ్లి న్యూస్ మరోసారి టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ కు చెందిన ఓ బడా నిర్మాతని అనుష్క పెళ్లాడబోతుందని.. కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదట.

స్వీటి పెళ్లికి రెడీ అవుతోన్న మేటరు నిజమే. బాహుబలి 2, లేటీ ఓరియెంటెడ్ చిత్రం భాగమతి ఈ రెండు చిత్రాలు పూర్తికాగానే స్వీటి పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇప్పటికే స్వీటి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకుని కూడా వెతికిపెట్టారట. వరుణ్ హైదరాబాదీ.. ప్రముఖ వ్యాపారవేత్త అంటున్నారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారట స్వీటీ కుటుంబ సభ్యులు.

ఇప్పటికే సమంత హైదరాబాద్ కోడలిగా మారిపోయింది. త్వరలో ఆమె నాగచైతన్యని పెళ్లాడనుంది. ఇప్పుడు అనుష్క కూడా హైదరాబాద్ కోడలు కానుంది. మొత్తంగా చూస్తే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అంతా హైదరాబాద్ లో కాపురం పెట్టేలా ఉన్నారు.

SHARE