అమిత్ షా కి వణికిపోతున్న తెలుగు పార్టీలు?

0
400
ap and telangana political parties fear because of amit shah

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ap and telangana political parties fear because of amit shah
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ని చూస్తే తెలుగు పార్టీలు వణికిపోతున్నాయి.పార్టీ విస్తరణ లక్ష్యంతో షా తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టాడని తెలిసినా ఆంధ్రాలో టీడీపీ,వైసీపీ గానీ తెలంగాణాలో తెరాస గానీ నోరు తెరిచి ఒక్క మాట అనలేకపోతున్నాయి.చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తుంటే ఆ అశ్వానికి ఏమీ జరక్కుండా చూసే సామంతుల్లా వుంది వీళ్ళ ప్రవర్తన.రెండు రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు దూకుడుగా మాట్లాడుతుంటే వారి నోట్లో నోరు పెట్టేందుకు తెలుగు ప్రాంతీయ పార్టీలు భయపడిపోతున్నాయి.అందుకు సాక్ష్యమే అమిత్ షా పర్యటన టైం లో చంద్రబాబు,జగన్ ప్రకటనలు.

“పార్టీ నేతలు ఇష్టానుసారం నోరు జారొద్దు..పొత్తులు,ఎన్నికల్లో కలిసి వెళ్లే విషయం గురించి అధిష్టానం చూసుకుంటుంది.మిత్రపక్షంగా వున్న పార్టీల గురించి నోరు జారి మాట్లాడటం సరికాదు. కేంద్ర మంత్రి వర్గంలో భాగస్వామిగా వున్నాం.అందుకు తగ్గట్టే రెండు పార్టీల నాయకులు స్నేహభావంతో వ్యవహరించాలి.” …పార్టీ నేతల నుద్దేశించి చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి.ఇక వైసీపీ అధినేత జగన్ కడప జిల్లా పర్యటనలో ఎవరూ అడక్కుండానే రాష్ట్రపతి ఎన్నికల ప్రస్తావన తెచ్చి మరీ ఆ పదవికి ఎన్నిక లేకుండా బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్ధికి పట్టం కడితే చాలు అన్నట్టు మాట్లాడారు.ఇక రాజకీయ ప్రత్యర్థుల్ని ఓ ఆట ఆదుకోవడంలో సిద్ధహస్తులైన తెరాస నేతలు షా టూర్ గురించి ఎక్కడా నెగటివ్ కామెంట్స్ చేసిన దాఖలాలు లేవు.మొత్తంగా చూస్తే అమిత్ షా భయపెట్టకుండానే తెలుగు పార్టీలు భయపడిపోతున్నాయి.

Leave a Reply