మళ్లీ అసెంబ్లీ వాయిదా..

 ap assembly meetings postponed

ప్రత్యేక హోదాపై తక్షణం చర్చించాలని డిమాండ్ చేస్తూ, వైకాపా సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి స్పీకర్ స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో వారిని మార్షల్స్ గట్టిగా అడ్డుకోగా, తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఉదయం సమావేశమైన సభలో గందరగోళం చెలరేగగా, స్పీకర్ కోడెల పది నిమిషాల పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరిగి అసెంబ్లీ ప్రారంభమైనప్పటికీ, వైకాపా సభ్యుల తీరు ఎంతమాత్రమూ మారలేదు. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని నినాదాలు చేస్తూ, పేపర్లను చించి స్పీకర్ పై వేస్తూ కొందరు, కెమెరాలను వెనక్కు నెట్టివేస్తూ మరికొందరు, బెంచీలెక్కి నినాదాలు చేస్తూ ఇంకొందరూ తమ నిరసనలు తెలిపారు. దీంతో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన కోడెల, మరోసారి సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

SHARE