ఏపీ అసెంబ్లీ లో హోదా రగడ ..

  ap assembly special status war

వరసగా రెండోరోజు కూడా ఏపీ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది.నల్ల చొక్కాలతో లోపలికి అడుగుపెట్టిన వైసీపీ సభ్యులు ప్రత్యేక హోదా అంశంపై చర్చకు పట్టుబట్టారు.ముందు ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తారని ..ఆ వెంటనే చర్చ చేపడదామని ఆర్ధిక మంత్రి యనమల చెప్పారు .అయితే అందుకు వైసీపీ సభ్యులు ఒప్పుకోలేదు.ముందే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు.అడ్డుకోబోయిన మార్షల్స్ పై దౌర్జన్యానికి దిగారు .

స్పీకర్ ఎంత నచ్చజెప్పినా వైసీపీ సభ్యులు వినలేదు.దీంతో స్పీకర్ కోడెల సభని 10 నిమిషాలు వాయిదా వేశారు.

SHARE