ఏపీలో ఏఈఈ పోస్టుల నోటిఫికేషన్

  ap assistant executive engineering posts notification ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజ‌నీర్ పోస్టుల భ‌ర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) గురువారం నోటిఫికేష‌న్ జారీచేసింది. మొత్తం 748 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 21 చివరి తేదీ కాగా నవంబర్‌లో పరీక్ష జరగనుంది. కాగా… తొలిసారిగా ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించబోతోంది.

SHARE