ఏపీ బీజేపీ బాహుబలి ఎవరు?

Posted March 28, 2017

ap bjp cm candidates ram madhav and nirmala seetharaman
2019 ఎన్నికలే టార్గెట్ గా ఏపీ బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా టీడీపీతో పొత్తు లేకుండానే సొంతంగా అధికారంలోకి వచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలని ఢిల్లీ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయట. దీంతో ఆ స్థాయిలో పార్టీని నడిపించే నాయకుడి కోసం ఏపీ కమలనాథులు వెయిట్ చేస్తున్నారు.

బాహుబలి లాంటి నాయకుడిని ఇస్తే పక్కాగా సత్తా చాటుతామని ఏపీ నాయకులు బీజేపీ అధిష్టానానికి వివరించారట. అలాంటి చరిష్మా ఉన్న నాయకులు ఎవరెవరు ఉన్నారని బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నట్టు టాక్. ఈ రేసులో వెంకయ్య నాయుడు పేరు వినిపించినా.. ఆయనను వదులుకోవడానికి మోడీ ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ఆయన పేరు పరిశీలనలోకి రాకపోవచ్చు.

ఇక మిగిలింది రామ్ మాధవ్, నిర్మలా సీతారామన్. ఏపీకి చెందిన రామ్ మాధవన్ ఆర్ఎస్ఎస్ కు గట్టి మద్దతుదారుడిగా పేరు తెచ్చుకున్నారు. మంచి వాయిస్ ఉన్న నేతగా… బీజేపీ యంగ్ బ్రిగేడ్ లిస్టులో ఆయన ఉన్నారు. కాబట్టి ఆయనను ఏపీకి పంపితే ఎలా ఉంటుందని కమలం పెద్దలు ఆలోచిస్తున్నారట. యూపీలో లాగా హిట్ కొట్టాలంటే.. రామ్ మాధవ్ లాంటి స్ట్రాంగ్ బ్యాట్స్ మెన్ ను పంపే అవకాశముందని సమాచారం. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే.. ఆయన కూడా ఏపీకి వచ్చేందుకు సుముఖంగానే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అమిత్ షా ఈ విషయంలో వెంకయ్య నాయుడు అభిప్రాయాన్ని తెలుసుకున్నారట. రాం మాధవ్ అయితే ఆయనే బాహుబలి అవుతారని వెంకయ్య చెప్పారట. అయితే మోడీ దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు నిర్మలా సీతారామన్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న ఆమెపై మోడీకి మంచి అభిప్రాయం ఉంది. ఆమె పెర్ఫామెన్స్ పై మోడీ చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి నాయకురాలిని ఏపీకి పంపడంపై కూడా బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారట. నిర్మల అయితే టీడీపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చని అధిష్టానం భావిస్తోందట.

అటు రాంమాధవ్, ఇటు నిర్మలా సీతారామన్ ఇద్దరిలో… బీజేపీ హైకమాండ్ ఎవరిని ఏపీకి పంపనుంది? అనుకున్నట్టుగానే ఏపీలో హిట్ కొట్టనుందా? అన్నది మోడీ నిర్ణయంపైనే ఆధారపడనుంది అని చెబుతున్నాయి బీజేపీ శ్రేణులు.

SHARE