Sunday, October 17, 2021
Homelatestవెంకయ్య దెబ్బకి బీజేపీ నేతల గుండెల్లో గుబులు..

వెంకయ్య దెబ్బకి బీజేపీ నేతల గుండెల్లో గుబులు..

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే మొదటిగా గుర్తొచ్చే పేరు వెంకయ్యనాయుడు.అయితే ఈ మధ్య మోడీ ప్రాభవం తో లబ్ది పొందేందుకు కొందరు బీజేపీ పంచన చేరి లేనిపోని హడావిడి చేస్తున్నారు.సాక్షాత్తు వెంకయ్యనే టార్గెట్ చేస్తున్నారు.ఈ పిల్ల కాకులకి వెంకయ్య మార్క్ షాక్ తగిలింది. ఇటీవల విజయవాడ సభలో ఆయన ప్రసంగం టైం లో కొందరు చేసిన పనికి అదిరిపోయే కౌంటర్ ఇస్తున్నారట వెంకయ్య .బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విజయవాడ సభ సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని హడావిడి చేసిన వారికి బాడ్ న్యూస్. అలా కార్డులు పట్టుకున్నవారితో పాటు,వారిని అందుకు ఎగదోసిన వారి మీద కూడా బీజేపీ అధిష్టానం కన్నేసింది.ఆ రోజు సభలో టీడీపీ పొత్తు వద్దన్న డిమాండ్ తో సభకు అంతరాయం కలిగించినవారికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ని పరిశీలించే పని ఇప్పటికే మొదలైంది.

వెంకయ్యనాయుడిని టార్గెట్ చేస్తూ కొందరు నేతలు కావాలనే అమిత్ షా సభను వేదికగా చేసుకుని ఈ విధంగా ప్రవర్తించారని హైకమాండ్ కి స్పష్టమైన సమాచారం ఉండటంతో ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుందట ఆ పార్టీ.ఈ వ్యవహారం వెనుక వెంకయ్య హ్యాండ్ ఉందని,ఆయన వాదనకు హైకమాండ్ మద్దతు పలికిందని తెలియగానే విజయవాడ సభలో ఎక్స్ట్రాలు చేసినవాళ్లు,చేయించిన వాళ్ళు కిందామీదా అవుతున్నారట. ఒకవేళ బీజేపీ పార్టీ నుంచి వేటేస్తే ఆ తర్వాత కేంద్రం మాటెలా వున్నా, చంద్రబాబు సర్కార్ ఇలాంటి వాళ్ళ పని పట్టడానికి రెడీగా ఉందని ఆ నేతలకు పక్కా సమాచారం ఉందట.అందుకే భవిష్యత్ గురించి ఆలోచించకుండా కేవలం టీడీపీ,బీజేపీ స్నేహాన్ని దెబ్బకొట్టి లబ్ది పొందుదామని చూసినవాళ్లంతా కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారట. ఇప్పుడు ఇలా కంగారు పడే బదులు బీజేపీ లో దిగ్గజం లాంటి వెంకయ్యని ఢీకొట్టే ముందు ఇలాంటివన్నీ ఆలోచించుకుని ఉండాలి.చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేముంటుంది?

- Advertisment -
spot_img

Most Popular