ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు..

 ap cabinate decisionsముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధుకు భారీ నజరానాను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. సింధుకు రూ.3 కోట్లు, గ్రూప్-1 ఉద్యోగంతో పాటు అమరావతిలో వెయ్యి గజాల స్థలం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు. కోచ్ గోపీచంద్‌కు రూ.50 లక్షల నగదు, ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌కు రూ.50లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది.

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు పుష్కరాలపై ఏపీ కేబినెట్ చర్చించింది. పరిశ్రమలకు భూ కేటాయింపులపైనా చర్చ జరిగింది. విభజన చట్టం ద్వారా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలతో పాటు కేంద్ర నిధులపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రివర్గం తీర్మానించింది. జీఎస్టీ బిల్లును కేబినెట్‌లో ఆమోదించి అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాలని నిర్ణయించింది. ఉద్యోగుల డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాలో జమచేయాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. ఈ సారి కూడా హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్‌లో నిర్ణయించారు. సెప్టెంబర్ 6 నుంచి వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.

SHARE