ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

ap cabinet decisionsమంత్రి పల్లె రఘునాధ రెడ్డి.

భారీ వర్షాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి 4లక్షల నష్ట పరిహారం అందించే భాద్యతలు మంత్రి ప్రత్తిపాటికి అప్పగించిన సీఎం.

పాక్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపిన క్యాబినెట్.

BCCI సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎంపికైనందుకు MSK ప్రసాద్ కు అభినందనలు తెలిపిన మంత్రి మండలి.

Indian Science Congress జనవరి మూడున తిరుపతిలో ప్రారంభ మౌతుంది.

సిసీ కెమేరాలు, డ్రోన్లు, ఆధునిక పరికరాల కొనుగోలు పై నిర్ణయాలకు రియల్ టైం గవర్నెన్సు బోర్డు ఏర్పాటు. దీనికి ఫైబర్ గ్రిడ్ కార్పరేషన్ ఎండీ, డీజీపీ సహా 5గురు సభ్యులుగా ఉంటారు.

ఏపీ ఫెర్రో అలాయిస్ ప్రొడ్యూసర్స్ అభ్యర్ధన మేరకు విద్యుత్ బిల్లులో రాయితీ కి షరతులతో కూడిన అనుమతి. 2016 ఫిబ్రవరి నుండి యూనిట్ ధరలో రూ1.50 పైసలు మినహాయింపు ఇస్తాం. దీనివల్ల నెలకు 23కోట్లు ప్రభుత్వం పై భారం.

విశాఖ జిల్లా అత్యుతాపురం మండలం మెరైన అవుట్ ఫాల్ పైప్ లైన్ నిర్మాణంలో నష్ట పోయిన 5000 కుంభాలకు 61 కోట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయం.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇళ్ళ నిర్మాణానికి నిర్ణయం.

వాక్ టూ వర్క్ ఎన్విరాన్మెంట్ తో  జీవన విధానాలు ఎంపిక చేస్తూ APIIC మరియూ APT, SDICO సంయుక్త భాగస్వామ్యంతో ఇండస్ట్రియల్ పార్కుల్లోని భూములను అభివృద్ది చెయ్యాలని నిర్ణయం.

పశు సంవర్ధక శాఖలో స్టేట్ లెవల్ కమిటీ ద్వారా 300సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నిర్ణయం.

ఏపీ బీసీ కమీషన్ సిఫార్సు మేరకు బీసీ డీ లోని 28వ క్రమ సంక్యలో ఉన్న సాతాని అనే మాట తొలగించి ఛాత్తర శ్రీ వైష్ణవ అనే పదాన్ని చేర్చడానికి ఆమోదం.

సివిల్ ఏవియేషన్ రంగంలో అభివృద్ధిని సాధించడానికి రీజనల్ కనెక్టివిటి పెంచడానికి AIRPORTS AUTHORITY OF INDA,AP GOVT మధ్య అవగాహనా ఒప్పందానికి నిర్ణయం.

మంగళగిరిలో 5వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మించాలని, విశాఖ రన్ వేను పెంచాలని నిర్ణయం.

విశాఖ జిల్లా అడవివరంలో PPP,లో ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ అభివృద్దికి ప్రియదర్శిని ఎడ్యుకేషనల్ సొసైటీ, నోవా గ్రూప్ తో కన్సార్టియంతో ఒప్పందం.

విజయనగరం జిల్లా గరుగుమిల్లి మండలం సింకి ఉల్లబద్ర గ్రామాల మధ్యలో ఏర్పాటు చేసిన ఉద్యానవన కళాశాలకు మొదటి సంవత్సరం నిర్వాహణకు 90పోస్టుల మంజూరుకు నిర్ణయం.

అన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ లెవల్ టూరిజం కౌన్సిలర్లు, అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతిలో సిటీటూరిజం కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం. ఎకరా 5కోట్లకు లోబడి 2.5 ఎకరాలు లీజుకు ఇచ్చే అధికారం ఇచ్చాం.

విశాఖలో గోల్ఫ్ టూరిజం ప్రమోషన్స్ కు మొదసరిలోవ గ్రామంలో 12.75 ఎకరాల పురపాలక శాఖ భూమిని ఈస్ట్ పాయిట్ గొల్ఫు క్లబ్ కు మార్కెట్ రేటు మీద 10% లీజుకు ఇవ్వాలని నిర్ణయం.

శ్రీకాకుళం కోట బొమ్మాళీ 209.84 ఎకరాలు వేధిక్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు, శ్రీమత్ ఉభయ వేధాంత చంద్ర పిటానికి కేటాయించాం.

50ఎకరాలకు ,1.5లక్షలు మిగిలిన 150ఎకరాలు ఎకరా 50వేలు చప్పున ఇవ్వాలని నిర్ణయం. నాలుగేళ్లలో పూర్తి చెయ్యాలని నిర్ణయం.

వెనుకబడిన తరగతుల గ్రాడ్యుయేట్ల పీజీ NTR విధేశీ విద్య కోసం ప్రతి విద్యార్దికి 10లక్షల ఆర్దిక సహాయం చెయ్యాలని నిర్ణయం.

ప్రతి జిల్లాలో బీసీ భవన్ నిర్మాణానికి అమోదం.

మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయితీల్లో అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాల పెంపు ర్యాటిఫై చేసాం.⁠⁠⁠⁠

SHARE