ap కేబినెట్ ముఖ్యాంశాలు….

0
192

  ap cabinet list of index
లెజిస్లేషన్ ఐటమ్స్ :
1. ఎఅండ్‌సీ: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ANGRAU యాక్ట్, 1963 సవరణకు సంబంధించిన బిల్లును శాసనసభ రానున్న సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఆమోదం. ఈ సవరణ ద్వారా రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలలను ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంచేందుకు వీలు కల్పిస్తూ ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం-2016 ఆర్డినెన్స్‌ను తొలగించి, దాని స్థానంలో డ్రాఫ్ట్ బిల్లును శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.

వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీ యాక్ట్ 2007కి ఈ సవరణ ద్వారా రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలలను ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంచేందుకు వీలు కల్పిస్తూ, పాత ఆర్డినెన్స్‌ను తొలగిస్తూ దాని స్థానంలో డ్రాఫ్టు బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

2. రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్టుమెంట్: భూ విక్రయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లను నియంత్రించేందుకు ప్రభుత్వం ఇప్పుడున్న చట్టానికి పదును పెడుతోంది.
దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ యాక్ట్, 1908లో అవసరమైన మార్పులు తీసుకురావడానికి రానున్న అసెంబ్లీ సమావేశాలలో బిల్లు ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీనిప్రకారం ఒకే భూమిని ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఇకపై వీలు పడదు. దీనివల్ల అవినీతి, మోసాలకు అడ్డుకట్ట వేసినట్టవుతుంది. సివిల్ లిటిగేషన్లు తగ్గుతాయి. దాని వల్ల జీఎస్‌డీపీ గ్రోత్ మెరుగవుతుంది.

3. ఏపీ వ్యాట్ యాక్ట్ 2005కి చేసిన సవరణలు సెక్షన్ 4(9), 13(5)(హెచ్) మరియు సబ్ ఎంట్రీ (15) ఎంట్రీ 39 షెడ్యూల్ 4కి సంబంధించిన బిల్లును లెజిస్టేచర్ అసెంబ్లీలో పెట్టడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనిప్రకారం: పర్యాటక ప్రాంతాలలో వున్న 3స్టార్, 5 స్టార్ హోటళ్లలో 14.5 నుంచి 5 % వ్యాట్ తగ్గిస్తూ, అదేవిధంగా మొబైల్ ఫోన్ల మీద కూడా వ్యాట్‌ని 5 %కి తగ్గిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి మంత్రిమండలి ఆమోదం.

4. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లో జీఎస్‌టీ బిల్లుకు ఆమోదముద్ర లభించింది. దీన్ని రాష్ట్రాలు కూడా ఆమోదించాల్సివుంది. 2003లో పరోక్ష పన్నులపై ఖేల్కర్ టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదిక 2006-07లో పార్లమెంటు ముందుకొచ్చింది. అప్పటి నుంచి విస్తృత చర్చలు, సంప్రదింపులు, సవరణలకు నోచుకుని ఇప్పుడు చట్టంగా రూపుదాల్చింది. ఈ వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన 122 వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2014కు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మద్దతు ఇవ్వాలని ఇవాళ జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది.

ల్యాండ్ అండ్ లీజ్ ఐటమ్స్:

1. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను, మరో 10 గ్రామాలలో 7,214.87 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుకోసం ఎపీఐఐసీకి జీవో నెంబర్ 155 అనుసరించి బేసిక్ వాల్యూ ప్రకారం కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయం.
2. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం అందాలపల్లి గ్రామంలో 0.94 ఎకరాల స్థలాన్ని ఎకరా రూ.12 లక్షల ధరకు పర్యాటకులకు సదుపాయాలు కల్పించే నిమిత్తం పర్యటకశాఖకు అందించాలని మంత్రిమండలి నిర్ణయం.
3. విశాఖ జిల్లా విశాఖ రూరల్ మండలం పరదేశీపాలెం గ్రామంలో 1.90 ఎకరాల భూమిని 133 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు నిమిత్తం ఏపీ ట్రాన్స్‌కోకు ఎకరాకు రూ.7.26 కోట్లకు అందించాలని మంత్రిమండలి నిర్ణయం.
4. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పిటూరు గ్రామంలో 61.63 ఎకరాల భూమిని సెజ్ విస్తరణ కోసం ఎకరా రూ.12 లక్షల ధరకు ఎపీఐఐసీకి అందించడానికి మంత్రిమండలి ఆమోదం.

అప్రూవల్ ఐటమ్స్:
1. ఏపీ బీసీ కమిషన్ సిఫారసుల మేరకు వెనుకబడిన తరగతుల జాబితాలోని సీరియల్ నెంబర్ 37 గ్రూపు ఏలో ప్రస్తుతం వున్న వడ్డె, వడ్డీలు, వడ్డి, వడ్డెలు అనే పదాలకు పర్యాయపదాలుగా వడ్డెర, వడ్డబోవి, వడ్డియరాజ్, వడ్డెర అనే పదాలను చేర్చడానికి మంత్రిమండలి ఆమోదం.
2. నాబార్డ్ ద్వారా స్థాపించబడిన కంపెనీ-అగ్రి బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు అదనపు మూలధన నిధిని సమకూర్చే అంశానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం రూ.1.16 కోట్లు అదనపు నిధిని సమకూర్చడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
3. ఐటీఈఅండ్‌సీ:

ఏపీటీఎస్ న్యూరోల్:
‘న్యూ రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్విసెస్ లిమిటెడ్’ అమోదం. ఇది ప్రొక్యూర్‌మెంట్ ఏజన్సీగా పనిచేస్తుంది. ఈ ఏజెన్సీ రూ. 50 లక్షలకు మించి ప్రొక్యూర్‌మెంట్ చేస్తుంది. ఇన్నోవేటీవ్ ప్రోడక్ట్స్ అయితే రూ.50 లక్షలలోపు కూడా చేస్తారు.
ఇతర రాష్ట్రాల్లో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ కోసం ఏపీటీఎస్ ద్వారా కృషి చేస్తారు.
సిస్టమ్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్టులలో ఏపీటీఎస్ భాగస్వామ్య పద్దతుల్లో ఇతర రాష్ట్రాలలో కూడా టెండర్లలో పాల్గొంటుంది.

టెక్నాలజీ కంపెనీలతో కలిసి ఏపీటీఎస్ జాయింట్ వెంచర్‌కు వెళుతుంది. కొత్త ఎలక్ర్టానిక్ పరికరాలను పరిచయం చేసే క్రమంలో ఏపీటీఎస్ కొన్ని స్టార్టప్ కంపెనీలతో కలిసి పనిచేస్తుంది. ఇకముందు కొనబోయే సీసీటీవీలు, ల్యాప్ ట్యాప్స్, బయోమెట్రిక్ డివైసులు, ట్యాబ్ లెట్ పీసీలు యాన్యుటీ పద్ధతిన కొనుగోలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

ఎలక్ట్రానిక్ పాలసీ:
ఎలక్ట్రానిక్ పాలసీలో సవరణకు ఆమోదం. దీనిప్రకారం ఎలక్ట్రానిక్ పాలసీలో ఐవోటీ పాలసీని మెర్జ్ చేస్తారు.
ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ: 25% అన్ని ఐటీ ప్రోడక్స్ట్‌కు.
ఎస్‌సీ, ఎస్‌టీ, ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్‌కు 30% ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీ.

ఐ అండ్ ఐ:
విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ల నిర్మాణాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ శాఖ ద్వారా పీపీపీ పద్దతిలో చేపడతారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ద్వారా మినిమం రెంటల్ గ్యారంటీ ఇస్తారు. 6 నెలల నుంచి ఏడాదిలోపు ఈ టవర్ల నిర్మాణం పూర్తికావాలని మంత్రిమండలి అభిప్రాయపడింది. ఇన్నోవేషన్ సెంటర్లు ఈ టవర్లలో నెలకొల్పుతారు. వీటికి మంత్రిమండలి ఐఅండ్ ఐకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం.

ర్యాటిఫికేషన్ ఐటమ్స్:
1. కార్మిక సంస్కరణలు-2015 (కొన్ని సంస్థల ద్వారా వివిధ కార్మిక చట్టాల కింద ఏకీకృత రిజిస్ట్రేషన్లు జారీ చేయడం, మరియు ఉమ్మడి రిటన్స్ దాఖలు చేయడం). చట్టం 2015లోని 10 వ చట్టం-9(1) వ విభాగం కింద ప్రకటనను జారీచేయడం ద్వారా చట్టానికి 2వ అనుసూచిని చేర్చడం. 9(20) విభాగం ప్రకారం చట్టాన్ని సవరించడం-ఈ ర్యాటిఫికేషన్‌కు మంత్రిమండలి ఆమోదం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి డీఐపీపీ రికమండేషన్ ప్రకారం కార్మిక సంస్కరణల్లో భాగంగా దీన్ని తీసుకొస్తున్నాం.  ఆక్వా అనుమతులు, ఐటీ ఇండస్ట్రీ అనుమతులు కూడా సింగిల్ విండో విధానంలోకి తీసుకురావాలని మంత్రిమండలి నిర్ణయించింది.

గెయిల్ :
గ్యాస్ ను ప్రస్తుతం బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మనకు స్టోరేజ్ వసతి లేదు. పశ్చిమ భారతదేశంలోనే వుంది. అక్కడి నుంచి మన రాష్ట్రానికి దిగుమతి చేసుకోవాలంటే మెట్రిక్ టన్నుకు రెండు డాలర్ల చొప్పున వ్యయం అవుతోంది. దీన్ని అధిగమించాలంటే ఏపీగ్యాస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ 50శాతం గెయిల్ షేర్, 50 శాతం ఏపీజీఐఎస్ (ఏపీఐఐసీ, ఏపీ జెన్ కో) తో ఈ స్టోరేజ్ ఫెసిలిటీని కాకినాడలో నెలకొల్పడానికి ప్రతిపాదన ప్రస్తుతం కేబినెట్ ముందుకొచ్చింది. ఇది పెట్టడానికి రూ1010 కోట్లు వ్యయం అవుతుంది. రూ.800 కోట్లు రుణ సేకరణ అవసరం అవుతుంది. 2018 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలన్నది లక్ష్యం. ఈ స్టోరేజ్ ద్వారా కాకినాడ నుంచి శ్రీకాకుళం ద్వారా సిటీ గ్యాస్ సరఫరా, ఇండస్ట్రియల్ యూనిట్స్‌కు గ్యాస్ సరఫరా జరుగుతుంది. పరిశ్రమలు, ట్యాక్సేషన్, మౌలిక వసతులకు మేలు జరుగుతుంది. ఎంప్లాయిమెంటు జనరేషన్ జరుగుతుంది.

ఇతర అంశాలు:
• లక్షమంది ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రభుత్వ జల సంరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేస్తారు.
• 8వ తరగతి నుంచి వనం-మనం, స్వచ్ఛాంధ్రప్రదేశ్, జల సంరక్షణ కార్యక్రమాల్లో ప్రతి శనివారం భాగస్వాముల్ని చేసేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. సెల్ఫీలతో, జియో ట్యాగింగ్ వంటి కార్యక్రమాలతో విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
• అక్టోబరు 2లోపు వందశాతం అర్బన్ ఏరియాలో వందశాతం ఓడీఎఫ్ చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
• కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రులు, శాఖాధికారులతో కలిసి రియల్ టైమ్ లో పరిపాలన జరిపేలా చూడాలని మంత్రిమండలి నిర్ణయించింది.
• జిల్లాలలో, రాష్ట్రస్థాయిలో ఇన్నోవేషన్ సొసైటీలు పెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. కళాశాలల్లో ఇన్నోవేషన్ ఛాప్టర్‌లు వుంటాయి. చురుగ్గా పనిచేసే విద్యార్థులకు ప్రోత్సాహకాలు వుంటాయి.
• డిజిటల్ లిటరసీ విద్యార్థుల ద్వారా జరపాలని మంత్రిమండలి నిర్ణయించింది. విద్యార్థులకు ప్రోత్సాహకంగా స్మార్టు ఫోన్లను అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. డిజిటల్ స్టేట్‌గా ఏపీని అభివృద్ధి చేయాలని లక్ష్యం.

Leave a Reply