ఏపీ కేబినెట్‌ కొత్త బిల్లులు…

0
101

  ap cabinet new bills 

జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం ప్రత్యేకంగా సమావేశమవుతున్న శాసనసభలో మొత్తం నాలుగు బిల్లులు ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సభలో ప్రవేశపెట్టబోయే జీఎస్టీ బిల్లు, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన మరో చట్ట సవరణ బిల్లు, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలకు అనుమతులిచ్చేందుకు చట్ట సవరణ బిల్లులకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు జిల్లాల్లో పలు భూకేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ అంశాలకు సంబంధించి డ్రోన్ల వినియోగంపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ సాగినట్లు సమాచారం.

Leave a Reply