ఏపి క్యాబినెట్ నిర్ణయాలు…

0
638
ap cabinet new decisions

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ap cabinet new decisionsఆంధ్రప్రదేశ్ వస్తు సేవల పన్ను, 2017 డ్రాఫ్టు బిల్లుకు క్యాబినెట్ ఆమోదం.

ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్విస్ ట్యాక్స్ బిల్లు, 2017ను ముసాయిదా బిల్లు ను ఆమోదించిన కాబినెట్ ప్రభుత్వంలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను 50 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం.దీనిపై గతంలో మంత్రుల బృందం చర్చించి చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త పీఆర్ సీ ప్రకారం కనీస వేతనం రూ.12 వేలు.

2010 పీఆర్‌సీ ప్రకారం ప్రస్తుతం జీతాలు అందుకుంటూ రూ.12 వేల కంటే తక్కువ వేతనం పొందుతున్నవారికి ఈ పెంపు వర్తిస్తుంది.దీనివల్ల ప్రభుత్వానికి రూ.200 కోట్లు అదనపు భారం ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి పెరిగిన జీతాలు వర్తింపు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ, 2017-22కు క్యాబినెట్ ఆమోదం.

పౌరులలో ఆనందం, క్రీడల్లో నైపుణ్యం సాధించడానికి అవసరమయ్యే సాధన సంపత్తిని సమకూర్చడమే పాలసీ లక్ష్యం.ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్టు (ఏపీ డీఆర్ పీ) అమలుకు గాను పోస్టులను మంజూరుకు క్యాబినెట్ ఆమోదం 30.09.2020 వరకు సేవలు అందించేందుకు ఉద్దేశించిన నియామకాలు.

ఏపీఈపీడీసీఎల్‌లో 22 మందిని తీసుకుంటారు. వీరికి ఏడాదికి రూ.1.92 కోట్లు చెల్లిస్తారు.

పంచాయతీరాజ్ శాఖలో 20 పోస్టులు. వీరికి ఏడాదికి రూ.1.84 కోట్లు.

ఆర్ అండ్ బీలో 18 పోస్టులు, వీరికి ఏడాదికి రూ.1.48 కోట్లు.

జీవీఎంసీలో 22 పోస్టులు. వీరికి ఏడాదికి రూ.2.04 కోట్లు.
ఉడాలో 9 మంది. వీరికి ఏడాదికి రూ.2.22 కోట్లు.
ఫారెస్టు డిపార్టుమెంటులో 17 పోస్టులు. వీరికి రూ.1.43 కోట్లు.
మొత్తం పోస్టులు 108. వీరికి రూ.10.96 కోట్లు.

పోస్టుల భర్తీ:

ప్రపంచబ్యాంక్ సహకారంతో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్సఫర్మేషన్ ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) కింద మొత్తం 73 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం.
ఈ పోస్టుల నిమిత్తం రూ.5.23 కోట్లు ఖర్చు.

భావదేవరపల్లి ఫిషరీస్ అండ్ పాలిటెక్నిక్ కాలేజీలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు మంత్రిమండలి పచ్చజెండా. మొత్తం 6 పోస్టులు. అందులో టీచింగ్ 4, నాన్ టీచింగ్ 2 పోస్టులు. ఏడాదికి భారం రూ.54.33 లక్షలు.

హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్టుమెంటులో నియామకాలు :

హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖలో జాయింట్ డైరెక్టర్ పోస్టును అడిషనల్ డైరెక్టర్ పోస్టుగా అప్ గ్రేడ్ చేసేందుకు మంత్రిమండలి ఆమోదం.ఇన్సూరెన్స్ మెడికల్ సర్విసెస్ విభాగంలో ఒక డైరెక్టర్ పోస్టు సృష్టికి మంత్రిమండలి ఆమోదం.

దివ్యాంగులకు పోటీ పరీక్షలలో శిక్షణ ఇచ్చేందుకు విజయవాడలో ఏర్పాటు చేసిన స్టడీసర్కిల్‌లో బోధన, బోధనేతర సేవలను అవుట్ సోర్సింగ్ పద్దతిలో సమకూర్చుకునేందుకు కాబినెట్ ఆమోదం.ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.నూతన మంత్రుల పేషీల్లో 88 మంది సిబ్బందిని నియమిస్తూ ఇచ్చిన జీవో ఎంఎస్ నెం. 69కి కేబినెట్ ఆమోదం.

Leave a Reply