Posted [relativedate]
ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఫిక్సయ్యిందా? వచ్చే వారమే చంద్రబాబు కేబినెట్ లో మార్పులు- చేర్పులు జరగనున్నాయా? కొందరు మంత్రులపై వేటు పడనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది.
కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా కొన్ని మార్పులు- చేర్పులు చేయబోతున్నారు. ఉగాది రోజే ఈ మార్పులు- చేర్పులు చేయాలనుకున్నా… కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడిందట. ఏప్రిల్ 2న ముహూర్తం నిర్ణయించారని సమాచారం. ఏప్రిల్ 2న మంచిరోజు ఉండడంతో అదే రోజు కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఒకవేళ ఆ రోజు కూడా ఏవైనా అనుకోని ఇబ్బందులు వస్తే.. ఏప్రిల్ 6 వైపు మొగ్గు చూపే అవకాశం కూడా లేకపోలేదు.
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పకపోవచ్చు. ఇక కొందరు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశముంది. లోకేశ్ కు మంత్రిపదవి ఖాయమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మిగిలిన వారిలో భూమా అఖిలప్రియ, జ్యోతుల నెహ్రూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు ఒకరిద్దరిని కేబినెట్ లోకి కొత్తగా తీసుకునే అవకాశముందట. మొత్తానికి ముహూర్తం దగ్గరపడడంతో ఎవరికి బంపర్ ఆఫర్ దక్కుతుందో..? ఎవరి పోస్ట్ ఊస్ట్ అవుతుందోనని చర్చ జరుగుతోంది.