Posted November 30, 2016, 7:48 pm
నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్వీనర్‌గా 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు .దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనేదానిపై ఈ కమిటీ అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.టీం ఇదే .. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్, పవన్‌కుమార్ చామ్లింగ్ తదితరులు ..