ఏపీలో చైర్మన్ల నియామకం….

Posted September 30, 2016

 ap corporate chairmans posts

ఏపీలో 8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం జరిగింది. ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌గా ప్రొ. వి జయరామిరెడ్డి, హస్తకళల కార్పొరేషన్‌ చైర్మన్‌గా పాలి ప్రసాద్‌, కనీస వేతన సలహాబోర్డు చైర్మన్‌గా డొక్కా మాణిక్యవరప్రసాద్‌, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా యలమంచిలి గౌరంగబాబు, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మహ్మద్‌ ఇదాయత్‌, మేదర కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా యం. సుందరయ్య, కల్లుగీత సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌గా తాత జయప్రకాశ్‌ నారాయణ, బలిజ, పూసల కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌గా కావేటి సామ్రాజ్యంను నియమించారు. అన్నవరం దేవస్థానానికి 13 మంది సభ్యులను నియమించారు. బ్రాహ్మణ వేల్ఫేర్‌ కార్పొరేషన్‌కు ఆరుగురు సభ్యుల నియామకం జరిగింది.

SHARE