నంది అవార్డుల మీద దృష్టి పెట్టిన ఏపి ప్రభుత్వం

Posted December 22, 2016

AP Government Decide To Continue Nandi Awards2012 నుండి ఇప్పటిదాకా నంది అవార్డుల ప్రధానోత్సవం జరుగలేదు. ప్రతి సంవత్సరం ఉత్తమ కళాకారులకు అవార్డులను ఇచ్చి ప్రోత్సహించే నంది అవార్డులను గత మూడు సంవత్సరాలుగా ఇవ్వడం మానేశారు. ఇక ఈ మధ్యలోనే స్టేట్ డివైడ్ అవడం వల్ల తెలంగాణలో నందికి బదులు సింహా అవార్డులను ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఏపిలో మాత్రం అదే నంది అవార్డులను కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం 2012 సంవత్సరానికి గాను జయసుధ సమక్షంలో 13 మందితో ఓ కమిటి ఏర్పాటుచేయగా.. 2013 కు గాను కోడి రామకృష్ణ అధ్యక్షతన ఓ కిమిటి ఏర్పాటు చేశారట.

ఎన్ని అవార్డులొచ్చినా ప్రభుత్వం తరపున వచ్చే నంది పురస్కారాలు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరియర్ లో ఇన్ని నందులు వచ్చాయి అని సగర్వంగా చెప్పుకునే విధంగా నంది అవార్డుల ప్రతిష్టత ఉంటుంది. అయితే మూడు నాలుగు సంవత్సరాలుగా అవార్డులను ఇవ్వడం మానేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటిని మళ్లీ కంటిన్యూ చేయాలని చూస్తుంది. కళాకారులందరికి ఇదో గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ కార్యక్రమం కూడా త్వరలోనే జరుగనున్నదని తెలుస్తుంది.

SHARE