బాబు ని ఇరుకున పెట్టిన కెసిఆర్..

0
621

Posted [relativedate]


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు,కెసిఆర్ మధ్య ఇప్పుడు ఏ వైరం లేదని వినిపిస్తున్న టాక్. అయితే ఆ మౌత్ టాక్ కి భిన్నంగా అప్పుడప్పుడు టీడీపీ,తెరాస మధ్య చిటపటలు చూస్తూనే వున్నాం.ఇటీవల విభజన బాధల్ని ఏకరువు పెట్టినపుడు కెసిఆర్ కుమార్తె కవిత గొంతు విప్పింది. తెలంగాణ కి వ్యతిరేకంగా ప్రకటన చేసినందుకు బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.ఇలా అప్పుడప్పుడు జరుగుతున్నా మొత్తం మీద రెండు పక్షాలు సామరస్య ధోరణితోనే ముందుకెళ్తున్నట్టు అనిపిస్తోంది.అయితే తాజాగా బడ్జెట్ విషయంలో కెసిఆర్ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం చంద్రబాబుకి ఇబ్బంది తెచ్చిపెట్టింది.అదేంటో చూద్దాం..

2017 బడ్జెట్ లో కెసిఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం 30 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఈ నిర్ణయం మీద తెలంగాణ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా కెసిఆర్ దగ్గరకెళ్ళి కృతజ్ఞతలు చెప్పి వెళ్లారు.ఇది చూసి ఏపీ జర్నలిస్టులు కూడా బడ్జెట్ మీద ఆశలు పెట్టుకున్నారు. ఏపీ రాష్ట్ర బడ్జెట్ 1 ,56 ,999 లక్షలతో బడ్జెట్ అయితే వచ్చింది గానీ విలేకరుల సంక్షేమం కోసం ఒక్క పైసా కేటాయింపు కూడా జరగలేదు.మీడియా మేనేజ్ మెంట్ లో దిట్ట అని పేరుపడ్డ చంద్రబాబు జర్నలిస్టుల విషయంలో మాత్రం ఉదారంగా వ్యవహరించిందిలేదు.అయితే అప్పటికీ ఇప్పటికీ విధానాల విషయంలో ఎన్నో మార్పులు చేసుకున్న బాబు జర్నలిస్టుల విషయంలో మాత్రం పట్టించుకోలేదు.దీంతో భగ్గుమన్న జర్నలిస్ట్ సంఘాలు విజయవాడ వేదికగా భారీ సదస్సు నిర్వహించబోతున్నారు.ఏప్రిల్ 9 న విజయవాడ లో దాదాపు 5 వేల మంది జర్నలిస్టులు ఈ సదస్సుకి వస్తున్నారు.తెలంగాణ బడ్జెట్ తో పోల్చుకుని 50 కోట్ల సంక్షేమ నిధి,ఇళ్ల స్థలాలు డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టులు.ఏమైనా తన పని తాను చేసుకుని కూడా బాబుని ఇరుకున పెట్టారు కెసిఆర్..కాదంటారా ?

Leave a Reply