అది ఏపి మ్యాప్ కాదు… ఎక్కుపెట్టిన గన్

Posted February 1, 2017

ap map looks like gun

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరినో ఒకరిని టర్గెట్  చేసే వివాదాస్సద దర్వకుడు రామ్ గోపాల్ వర్మ్ ఈ సారి ఏపి  మ్యప్ ను టార్గెట్ చేశాడు. తనదైన శైలిలో విమర్శలు, ప్రశంసలు చేసే వర్మ… డిస్ట్రిక్ట్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక మ్యాప్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘గన్’ లా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను తాను ఇష్టపడుతున్నానని ఆ ట్వీట్ లో వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

అది కూడా సరస్వతి దేవి చేతలోని వీణ ప్లేస్ లో ఏపి మ్యాప్ ను ఉంచి ఆసక్తికర ఇమేజ్ లను కూడా పోస్ట్ చేశాడు. గన్ లా ఉన్న ఏపీ మ్యాప్ గురి ప్రత్యేక హోదానే అంటూ… ఆ గురి తప్పని రీతిలో దూసుకుపోవాలంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. లక్ష్య సాధనలో ఏపీ గన్ సఫలీకృతం కావాలని తాను ప్రగాఢంగా కోరుకుంటున్నానని వర్మ ట్వీటారు.

SHARE