Posted [relativedate]
యువ నేత లోకేష్ ఎమ్మెల్సీ గా అధికారికంగా ఎంపికైన తర్వాత క్యాబినెట్ విస్తరణ మీద ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. క్యాబినెట్ లో కొత్తగా ఎవరికి చోటివ్వాలి? ఎవరికి మంగళం పలకాలి అన్నదానిపై ఇప్పటికే బాబు కసరత్తు మొదలెట్టారు.అయితే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో క్యాబినెట్ రీ షఫుల్ ఎప్పుడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.ఎందుకంటే..ఈసారి క్యాబినెట్ లోకి లోకేష్ రాబోతున్నాడు కాబట్టి ఆ ముహూర్తం బ్రహ్మాండంగా వుండాలని బాబు అనుకుంటున్నారు.ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంలో కూడా ముందుగా అనుకున్న ముహూర్తం టైం కి లోకేష్ రాలేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ముహూర్తం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.
క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ ముహూర్తం పెట్టవలిసిందిగా బాబు తరపున ముగ్గురు పండితులకి సందేశం వెళ్లిందట.అందులో లోకేష్ ని దృష్టిలో ఉంచుకుని ముహూర్తం ఖరారు చేయమని చెప్పే వుంటారు.ఆ ముగ్గురు ముహుర్తాలు పెట్టాక ఏది మంచి ముహుర్తమో ఓ చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.ఈ మొత్తం వ్యవహారాన్ని లోకేష్ తల్లి భువనేశ్వరి పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం.ఇప్పటి దాకా వున్న సమాచారాన్ని బట్టి ఏప్రిల్ నెల రెండో వారంలో క్యాబినెట్ విస్తరణ ఉండొచ్చని పక్కా సమాచారం.అంతా బాగానే వుంది కానీ ఈ తంతు చూస్తుంటే ఒకటి అనిపిస్తోంది.క్యాబినెట్ విస్తరణ కోసం ముహూర్తం పెడుతున్నారా లేక ముహుర్తాన్ని బట్టి క్యాబినెట్ విస్తరిస్తున్నారా?