Tuesday, October 26, 2021
Homelatestకాపు ఉద్యమానికి అండ కోల్పోయిందా?

కాపు ఉద్యమానికి అండ కోల్పోయిందా?

 నటుడిగా ఎన్టీఆర్ ను ఎంత అభిమానించినా.. దాసరి రాజకీయంగా మాత్రం తెలుగుదేశానికి వ్యతిరేకంగానే తొలి నుంచీ అడుగులు వేశారు. కాంగ్రెస్ లో చేరడం దగ్గర్నుంచి చంద్రబాబు సీఎంగా ఉండగా నక్సలైట్లను రెచ్చగొట్టే సినిమాలు తీయడం వరకూ ప్రత్యేక స్టైల్ పాటించారు. అదే విధంగా విభజన తర్వాత కాపు ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు.

పార్టీలకు అతీతంగా నేతలతో దాసరికి ఉన్న సత్సంబంధాలు ముద్రగడ అరెస్ట్ సమయంలో పనికొచ్చాయి. ముద్రగడను కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేయడాన్ని గట్టిగా ఖండించిన దాసరి.. అందుకు జగన్ మద్దతు ఇప్పించడంలో కూడా కీలకంగా వ్యవహరించారు. తన నివాసంలోనే కాపు ప్రముఖుల భేటీ ఏర్పాటు చేసి.. కాపుల ఉద్యమ కార్యాచరణ ఖరారు చేశారు.

కానీ ఇప్పుడు దాసరి లేరు. పెద్దాయన మీద గౌరవంతో ముద్రగడకు మద్దతిచ్చిన వారంతా ఇప్పుడు మద్దతిస్తారా అంటే ఖచ్చితంగా ఔనని చెప్పలేం. దుందుడుకు నిర్ణయాలతో, అస్థిర కార్యాచరణతో ముద్రగడ అనుకున్నది సాధించలేరనే అభిప్రాయం వ్యక్తమౌతున్న తరుణంలో.. దాసరి మార్గదర్శనం లేకపోవడం తీరని లోటేనని చెప్పక తప్పదు.

- Advertisment -
spot_img

Most Popular