పుష్కరాల్లో అన్నదానం రికార్డ్..

 ap pushkaralu free food serving devoteesగడచిన 8 రోజుల పుష్కరాల సందర్భంగా సమన్యంతో పనిచేస్తూ ఏమాత్రం లోపం లేకుండా బాగా పనిచేశారు, రాబోయే చివరి మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని నేడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను వాలంటీర్లు ఇతర సేవా సంస్థలను అభినందించారు.
కృష్ణా పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాం, ఇప్పుడే మాత్రం అలసత్వం ఉండకూడదు, మొదట్లో చూపిన ఉత్సాహం తగ్గకుండా మరింత చురుకుగా విధులు నిర్వహించాలని కోరారు.

కృష్ణా పుష్కరాలలో రోజుకు 7.5 లక్షల చొప్పున గత 8 రోజుల్లో 58 లక్షల మందికి అన్నదానం, ఆహార పంపిణీ చేయడం నిజంగా ఒక చరిత్ర అని స్వర్ణదేవాలయంలో, తిరుపతిలో రోజుకు లక్షమందికి అన్నదానం చేస్తారు, షిరిడీ దేవాలయం, పూరీ జగన్నాధ్ ఆలయంలో 40వేల మందికి మహాప్రసాదం అందిస్తారు,ఐతే కృష్ణా పుష్కరాలలో రోజుకు 7.5 లక్షల మందికి అన్నదానం చేయడం నిజంగా ఒక చరిత్ర అని వీటన్నింటినీ డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసించారు

అందుకు కారకులైన ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛందసంస్థలు, సమాజ సేవకులు, అన్నివర్గాల ప్రజలకు, సంస్థలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ నాయకులు, ప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు విచారించేందుకు పుష్కరాలు ఒక అవకాశం అన్నారు.ఈ అవకాశం అందిపుచుకొని
ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తమ ప్రాంత ప్రజలందరినీ పలకరించి పుష్కరస్నానం చేశారోలేదో తెలుసుకోవాలి, పుష్కర ఏర్పాట్లపై వారి అభిప్రాయాలు తీసుకోవాల్సిందిగా కోరారు.

పుష్కర ఘాట్లలో స్నానం చేస్తున్న వృద్దులు, వికలాంగులకు ఉద్యోగులు, సిబ్బంది సహకరింటం తో పాటు
పిండప్రదానానికి భారీగా ప్రజలు వస్తున్న దృష్ట్యా, దానికి తగ్గట్లుగా అన్ని ఘాట్లవద్ద ఏర్పాట్లు ఉండేలా చూడాలని కోరారు.
పిండప్రదానానికి ఇప్పటివరకు లక్ష కిట్లు అందజేశారు, ఇంకా 50వేలు కిట్లు సిద్దం చేయాలి, టెంట్ల విస్తీర్ణం పెంచాలని అధికారులని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో సేవలపై వైద్య, ఆరోగ్య శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అలాగే చివరి మూడు రోజులు పుష్కార యాత్రీకులు ముఖ్యంగా
ఆదివారం యాత్రీకుల సంఖ్య భారీగా ఉంటుంది కాబట్టి బందోబస్తు, రవాణా, ఆహారం,తాగునీరు సరఫరా ఏర్పాట్లు అధికంగా చేయాలని ఈ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

SHARE