రాజకీయం నిరుద్యోగం పెంచుతున్న ap సర్కార్…

 ap sarkar noticed central govt dismissed mptc zptc posts

జడ్పీ, ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయమని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇది వరకే తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి నివేదించగా,  ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అదే సిపార్సే చేసింది! మరి ఇదే జరిగితే ఒకేసారి ఏకంగా పది వేల మందికిపైగా ఎంపీటీసీలు, 660 మంది జడ్పీటీసీలు వీరిలోనే భాగమైన ఎంపీటీసీ చైర్మన్ లు, జడ్పీటీసీ చైర్మన్ లు రాజకీయ నిరుద్యోగులైపోతారు! ప్రస్తుతం ఎంపీటీసీ పదవి అనేది కూడా పెద్ద హోదానే! అది కూడా అధికార పార్టీ తరపున ఈ హోదాల్లో ఉన్న వారి పైరవీలు,పలుకుబడి ఏ స్థాయిలో ఉంటుందో గ్రామాల్లోకి వెళ్లి చూస్తే అర్థం అవుతుంది. మండల కేంద్రాల్లో రౌడీ షీటర్లలో చాలా మందికి ఎంపీటీసీ హోదా నో, మండల  పరిషత్ చైర్మన్ హోదానో ఉంటుంది! ఇక జడ్పీ మెంబర్లు, జడ్పీటీసీ చైర్మన్లు కూడా ఎమ్మెల్యే లకు కింది స్థాయి అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.

అయితే ఎంపీటీసీ మెంబర్ల కన్నా సర్పంచ్ ల చేతిలోనే ఎక్కువ అధికారాలు ఉంటాయి. అనేది కూడా అందరూ ఎరిగిన వ్యవహారమే. కానీ ఎంపీటీసీ,  జడ్పీటీసీలు  అనేవి హోదాగా, పైరవీలకు పనికొచ్చేవిగా, కాంట్రాక్టులు సంపాదించుకోవడానికి,అధికార పార్టీ నేతగా చెలామణి కావడానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇదే సమయంలో జడ్పీ, ఎంటీటీసీ ఎన్నికలను మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలను దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలూ అదే స్థాయిలో తాపత్రయపడుతూ ఉంటాయి. జడ్పీ చైర్మన్ ఎన్నికల సందర్బాల్లో అయితే రాజకీయం వేడెక్కుతూ ఉంటుంది. జడ్పీ సభ్యులు పార్టీలు ఫిరాయించడం,ఫలితాలను తారుమారు చేయడం అధికారంలో ఉన్నది ఎవరైనా ఈ జడ్పీ చైర్మన్ పదవులను తమ పార్టీ కే దక్కేలా చేయడానికి రసవత్తర రాజకీయం చేయడం ఐదేళ్లకొకసారి జరుగుతున్న వ్యవహారమే.

ఇలాంటి రాజకీయానికి పుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైనట్టుంది. ఇదే జరిగితే రాజకీయ నిరుద్యోగులు ఎక్కువవుతారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ లు  ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అధికంగా ప్రాధాన్యతను ఇచ్చాయి. ప్రతిపక్ష పార్టీల గుర్తులపై ఆ హోదాలకు గెలిచిన వారికి తమ కండువాలు వేయడంలో ఈ పార్టీలు పోటీపడ్డాయి. వారి చేరికలను పండగలా సెలబ్రేట్ చేశాయి. ఇదంతా జరిగి రెండేళ్లు అయినా కాకముందే ఇప్పుడు ఈ వ్యవస్థనే రద్దు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు  సిఫార్సు చేయడం ఆసక్తికరమైన అంశం. ఈ వ్యవస్థలు రద్దు కావడం అటు రాజకీయ పార్టీలకూ, ఇటు ప్రభుత్వానికి కొంచెం భారం తగ్గడమే. జడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలంటే ప్రభుత్వంతో పాటు పార్టీలు కూడా ఖర్చు చేయవలసిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ పదవులు రద్దు అయితే  పార్టీలకు కొంత భారం తగ్గుతుంది కాని ప్రస్తుతం  పదవుల్లో ఉన్న వారిని ఎలా ఎలా సంతృప్తి పరుస్తాయోవేచి చూడాలి.

SHARE