పార్లమెంట్ లో వరుసగా రెండోరోజు కూడా ప్రత్యేక హోదా డిమాండ్ మిన్నంటింది.లోక్ సభ ప్రారంభానికి ముందు గాంధీ విగ్రహం దగ్గర దేశం ఎంపీలు నిరసన తెలిపారు.సభ మొదలు అయ్యాక టీడీపీ,వైసీపీ ఎంపీలు నినాదాలు చేశారు.ప్లకార్డులు ప్రదర్శించారు.స్పీకర్ సుమిత్రామహాజన్ వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.నిరసనల మధ్యే సభ కొనసాగింది.రోజూ ఇలా అంతరాయం కలిగించడం సబబు కాదని ఆమె అన్నారు.
నిరసన ఆపాలని కోరుతూ మహాజన్ …టీడీపీ,వైసీపీ ఎంపీలతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.ప్రత్యేక హోదా ప్రకటించేదాకా పోరాటం ఆపేదిలేదని ఎంపీలు స్పీకర్ కి తేల్చి చెప్పారు.