ఏపీ రాజధాని ప్రాంతం కొత్త శోభతో కళకళలాడుతోంది.మన రాష్ట్రం లోనే మన రాజధాని ఉండాలనే చంద్రబాబు సంకల్పం ఆచరణలోకి రావడానికి రెండేళ్ల సమయం పట్టింది. ఉద్యోగుల రాకతో ఎట్టకేలకు వాస్తవమైంది.ఇప్పటికే 70% శాఖలు విజయవాడ,గుంటూరు ప్రాంతానికి తమ శాఖలను తరలించాయి.ఇంకా ఈ రోజు రెండు శాఖలు పంచాయితీ రాజ్ ,గిరిజన సంక్షేమ శాఖ తమ కార్యాలయాలను తరలించనున్నాయి.మిగిలిన వాటికి భవనాలను గుర్తించారు.
రాష్ట్రానికి తరలివస్తున్న ఉద్యోగులతో అమరావతి పరిసరాలు సందడిగా మారుతున్నాయి. నేడు విజయవాడలో పలుశాఖల హెచ్‌వోడీ కార్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఏలూరు రోడ్డులో జరిగిన సంక్షేమ శాఖ ఆఫీసు, సూర్యరావుపేట పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం, బందర్‌రోడ్డులోని జెడ్పీ కాంపౌండ్‌లో పంచాయతీ రాజ్ ఈఎన్సీ ప్రసాదంపాడులో ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.ఇలా వివిధ కార్యాలయాలకు విజయవాడ అడ్డాగా మారనుంది.మరికొన్ని కార్యాలయాలకు గుంటూరు ఆశ్రయం ఇస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాలన్నీ 27 లోపు తరిలివస్తూఉంటే ఒక్క హోమ్ శాఖ మాత్రం మీరెళ్ళండి…. మేమిప్పుడు రాం అంటుంది కారణం అడిగితే మాకక్కడ భవనం లేదని చెప్తుంది .జులై 15 లోపు వెలగపూడిలో హోమ్ మంత్రి పేషీ పూర్తి అవ్వచ్చు.ఇక డీజీపీ కార్యాలయం విషయానికొస్తే విజయవాడ లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలోనే రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయాన్ని ఏర్పటుచేసారు.సూర్యాపేటలోని గోపాలరెడ్డి రోడ్డులో కోర్టులకు ఎదురుగా ఈ కార్యాలయాన్ని నెలకొల్పారు.