2019 లో ఏపీ లో పొత్తులివే ..

 Posted November 2, 2016

ap state parties participated another party going for 2019 elections details
2019 ఎన్నికలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం దాదాపు క్లియర్ అయింది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు?ఎవరి వెనుక ఎవరు నడుస్తారు? దీనిపై రాష్ట్ర నేతలు కాస్త గుంభనగా ఉంటున్నా ఢిల్లీ పెద్దల మాటల్లో ఆ వ్యూహాలు బయటపడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఏపీ పర్యటనకి వచ్చిన కాంగ్రెస్,బీజేపీ నేతలు ఆ గుట్టు దాదాపు విప్పేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత డిగ్గీ రాజా వైసీపీ అధికారిక ప్రకటన రాకముందే జగన్ పాదయత్రని స్వాగతిస్తామని చెప్పారు.హోదా అంశంలో కూడా కలిసి పని చేస్తామని దిగ్విజయ్ తెలిపారు. ఇంతకుముందే వైసీపీ కూడా ఎవరు హోదాకి మద్దతిస్తే వారితో ఎన్నికలకి కలిసి వెళ్ళడానికి అభ్యంతరం లేదని చెప్పింది.ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీ ,కాంగ్రెస్ ఉమ్మడి పోరాటం ఖాయమనిపిస్తోంది.

ఇక విజయవాడ వచ్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సిద్దార్ధనాధ్ సింగ్ టీడీపీ తో తమకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు.కలిసి పని చేస్తామని వివరించారు.జనసేన గత ఎన్నికల్లో కూడా తమని బలపరిచిందే తప్ప పొత్తు పెట్టుకోలేదని సింగ్ వివరించారు.దీంతో పవన్ లేకుండా బీజేపీ ,టీడీపీ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది .

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రయాణం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అనంతపురం సభాస్థలికి తరిమెల నాగిరెడ్డి పేరు పెట్టడం ద్వారా పవన్ ఆలోచనలు అర్ధం చేసుకోవచ్చు.లెఫ్ట్ పార్టీలు సైతం జనసేనతో ఎన్నికల ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నాయి.ఈ విధంగా ఏపీ లో 2019 ఎన్నికలకి ముక్కోణపు పోటీ అవకాశాలు మెండుగా వున్నాయి.

SHARE