ఒక్క మనిషి… అబ్దుల్ కలాం

Posted October 15, 2016

new

APJ అబ్దుల్ కలాం… ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడి మనసులో ఆయన పట్ల గౌరవం.. ఆయన మనవాడేనన్న గర్వం రెండూ మెదులుతాయి.. ఇక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, భావి భారత నిర్మాతగా ఆయన చేసిన సేవలు అపురూపం.. అవన్నీ మననం చేసుకుంటూపోతే కలాం ఈ దేశానికి చేసిన సేవలకు అంతే లేదు. వాటిని తలచుకుంటే కలాం మీద భక్తి, ఆరాధనా భావం పెల్లుబికుతాయి. అయితే ఒక్క విషయాన్ని అందరం మర్చిపోతున్నాం. అదే ఆయన జీవన విధానం… ఏంటిది.? అందులో గొప్పేమిటి ? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం ఆయన ఒక మామూలు మనిషిగా… ఒక్క మనిషిగా బ్రతికారు

ఒక్క మనిషిగా బతకడమంటే.? డౌట్ వచ్చిందా.? ఔను దీనికి సమాధానం మనల్ని మనం తరచి చూసుకుంటే తెలిసిపోతుంది. మనసొకటి చెపుతోంది.. బయటకి మాట ఒకటి వస్తుంది. చేత ఇంకోటిగా ఉంటుంది. మొహం లో ఒక భావం పలుకుతుంది. గుండెల్లో దావాగ్ని రగులుతుంది.. ఔను ఇవన్నీ మనవే ..నిత్య జీవితంలో ఒక్కరిగా బతకలేక వీటన్నిటిని భరించలేక.. సతమతమవుతున్నా మనమే..

apj-abdul-kalam-special-stoఈ హిపోక్రసీ కి దూరంగా ఓ మనిషిగా బతికిన మహానుభావులు కలాం.. ఆయన మాట,మనసు, నడత ,నడవడిక అన్నీ ఒకేగీతపై సాగాయి. అలా బతకడం చెప్పినంత తేలిగ్గాదు. ఒక్క రోజు అలా బతకడం కాదు బతకడానికి ప్రయత్నిస్తేనే కలాం జీవన విధానంలో గొప్పతనం అర్ధమవుతుంది. ఆ జీవన విధానం రాబోయే తరాలకు ఆదర్శం కావాలి. పారదర్శక భారతం ఆవిష్కృతం కావాలి. అదే కలాం జయంతి సందర్బంగా మనమిచ్చే ఘనమైన నివాళి…

SHARE