Posted [relativedate]
జయలలిత మరణం మీద ఎన్నో పుకార్లు …మరెన్నో ఊహాగానాలు..ఇంకెన్నో అనుమానాలు. ఆ మరణం వెనుక కుట్ర ఉందని జయ మేనకోడలు దీపకుమార్ సహా ఆమె కుటుంబ సభ్యులంతా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక సాక్షాత్తు ఓ న్యాయమూర్తి కూడా వ్యక్తిగత స్థాయిలో విచారణ జరిగితే తప్పేమిటన్నట్టు మాట్లాడారు.ఇక అన్నాడీఎంకే శ్రేణుల్లోనూ జయ మరణం మీద డౌట్.
వీరిలో ఎక్కువమంది అనుమానం శశికళ మీద,మన్నార్ గుడి మాఫియా మీద.చికిత్స టైం లో జయని పరామర్శించడానికి వి.ఐ.పి లకు సైతం అనుమతి లేకపోవడం ఈ అనుమానాలకు ప్రధాన కారణమైంది.డౌట్ ఎవరి మీద అయినా చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి వర్గాల మీద కూడా అన్నాడీఎంకే శ్రేణుల్లో తెలియని అసంతృప్తి ఏర్పడింది.
పరిస్థితిని గమనించిన అపోలో చైర్మన్ సి.ప్రతాప్ రెడ్డి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో జయ మరణం మీద ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు.ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన జయ మరణం గురించి ఏ విచారణ జరిగినా చికిత్స వివరాలన్నీ ఇస్తామని వెల్లడించారు . ఆమెకి అత్యున్నత స్థాయి వైద్యం అందించాక కోలుకున్నారని …అయితే ఊహించని విధంగా గుండె పోటు వచ్చి మరణించారని ప్రతాప్ రెడ్డి వివరించారు.చికిత్స లో భాగంగా ఆమెకి కాళ్ళు తొలిగించారని వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు.వేడి చల్లారాక అపోలో ఇచ్చిన ప్రకటన తమపై వచ్చిన చెడ్డ పేరు తొలగించుకోడానికేనని అన్నాడీఎంకే శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.అయితే ఇప్పటికే జయ చికిత్స వివరాలు ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపామని శశికళ కూడా ప్రకటించారు.తాజాగా అపోలో ప్రకటనతో జయ మరణం మీద సందేహాలకు చెక్ పెట్టినట్టే అనిపిస్తోంది.