జయ మరణంపై అపోలో కోర్టుకు ఏమి చెప్పిందంటే..

0
540
apollo hospital says to high court about jayalalitha death details

  Posted [relativedate]

apollo hospital says to high court about jayalalitha death details
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు.కోర్టులోనే ఓ న్యాయమూర్తి సైతం తనకు కూడా కొన్ని సందేహాలు ఉన్నాయని చెప్పారు.ఈ పరిస్థితుల్లో జయ కి చికిత్స అందించిన అపోలో యాజమాన్యం మీద కూడా కొందరు డౌట్ పడుతున్నారు.

అమ్మ మృతి అనుమానాస్పదంగా ఉందని చెన్నై కి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త జోసెఫ్ వేసిన పిల్ మీద మద్రాస్ హై కోర్ట్ లో విచారణ సందర్భంగా అపోలో ఆస్పత్రి కీలక నిర్ణయం వెల్లడించింది .జయకి అందించిన చికిత్స నివేదికని సీల్డ్ కవర్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్ట్ కి విన్నవించింది.అయితే పిల్ వేసింది జయ కుటుంబ సభ్యులు కాకపోవడంతో పిటీషనర్ కి వివరాలు పొందే అర్హత,హక్కు గురించి కోర్టు ప్రశ్నించింది.ఈ కేసు విచారణని వచ్చే నెల 23 కి వాయిదా వేసింది.

Leave a Reply