యాపిల్‌ 50వేల యాప్స్‌ తీసేసిందట..

0
656

Posted [relativedate]

apple_1
అభివృద్ధి చెందిన దేశాల్లో.. ఉన్నత వర్గాల్లో తనదైన ముద్ర వేసి మార్కెట్‌ వాటా సంపాదించిన ఐఫోన్‌కు యాప్‌ కష్టాలొచ్చాయి.. యాపిల్‌ స్టోర్‌లో చెత్త యాప్స్‌ బాగా పెరిగపోయాయని భావించిన సంస్థ వెంటనే ప్రక్షాళనకు నడుం బిగించింది. అక్టోబరు నెల మొత్తం వీటిపై కసరత్తు చేసి దాదాపు 50 వేల వరకు చెత్త యాప్స్‌ని తొలిగించిందటా.. ఆయా యాప్స్‌ వల్ల సంస్థ కున్న క్రెడిబులిటీ దెబ్బ తినకుండా ఉండేందుకే ఈ చర్యలుచేపట్టినట్లు సంస్థ చెబుతుంది. దాని కోసం చాలా కాలం నుంచి ఎటువంటి అప్‌డేట్‌ లేకుండా ఉన్న యాప్స్‌, నిబంధనలు అతిక్రమించి భద్రత ప్రమాణాలు పాటించ ని యాప్స్‌పై కొరడా ఝళిపించింది. రెగ్యులర్‌గా తొలిగించడంతోపోల్చితే దాదాపు 238 శాతం అధికంగా తీసేసినట్లు పేర్కొంది. వాటిలోనూ ఎక్కువగా 28 శాతం గేమ్‌ యాప్స్‌ ఉండటం గమనార్హం.. ఆ తరవాతి స్థానాల్లో ఎంటర్‌టైనమెంట్‌, బుక్స్‌, లైఫ్‌స్టైల్‌ యాప్స్‌ ఉన్నాయట.. ఐఫోన్‌ వాడేవాళ్లు యాప్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకునేటప్పుడు రివ్వూస్‌పై కూడా ఓ లుక్‌ వేయండి మరి..

Leave a Reply