పొగడ్తలు ..వరాల జల్లులో సింధు..

0
531

 appreciation cash prize gifts presentation pv sindhuరియో ఒలింపిక్స్ లో రజత పతకం గెలిచి సత్తా చాటిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సింధూకి ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ అయితే అభినందించడమే కాదు.. నేను నీ అభిమానిని ఐపోయా అంటూ ట్వీట్ చేశారు.

సిల్వర్ మెడల్ తో మెరిసిన సింధూకి నజరానాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.కోటి నజరానాగా ప్రకటించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రూ.50 లక్షల బహుమతిని ప్రకటించారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సింధూకి రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్ కు రూ.10లక్షల నజరానా ప్రకటించింది. ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్  రూ.60లక్షల  బీఎండబ్య్లూ కారును బహుమతిగా ప్రకటించారు.

Leave a Reply