నిరుద్యోగులకు శుభవార్త .. పైనుంచి కిందకు ఉద్యోగ మాల ..

0
730

appsc udybhaskar

ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. పోస్టులు ఖాళీగా ఉండకుండా నివారించడం, అభ్యర్థులకు మేలు కలిగించడం లక్ష్యాలుగా ఈ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగాల భర్తీ ప్రకటనలో పేర్కొన్న అన్ని రకాల పోస్టులకు దరఖాస్తు చేయడం, ఒకటికన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికయితే మంచిదాన్ని ఎంచుకోవడం సాధారణంగా జరిగేదే. ఈ క్రమంలో ముందుగా చిన్న ఉద్యో గాల్లో చేరిన వారు, తరువాత పెద్ద ఉద్యోగాలు వచ్చిన వెంటనే వాటిల్లో చేరిపోతున్నారు. ఇలా వీరు వదిలివెళ్లిన ఉద్యోగాలను మరో నోటిఫికేషన్ ద్వారా కానీ భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ నిర్ణయాలు అనుసరించి ఉద్యోగాల ప్రకటనలు వెలువడుతుండడంతో సమస్యలు వస్తున్నాయి. గ్రూప్-1, 2, 3, 4, అసిస్టెంట్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పోస్టులు, ఇతర ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు రాబోతున్నాయి. గతంలో మాదిరిగా నియామకాలను చేపడితే మూడు, నాలుగు పోస్టులకు ఎంపికయ్యే వారు పెద్ద ఉద్యోగాన్నే ఎంచుకుంటారు. మళ్లీ ఉద్యోగాలు మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ నియమావళి రూల్ నెంబరు 6 అనుసరించి ఖాళీ అయ్యే ఉద్యోగాల్ని ఆ తరువాత జారీచేసే నోటిఫికేషన్‌లో చేర్చు తారు. రూల్-7 అనుసరించి వెయిటింగ్ లిస్టులో ప్రాధాన్యక్రమంలో ఉన్న వారితో ఉద్యోగాల్ని భర్తీచే యాలని ఉన్నా ఆచరణలో అనేక సమస్యలు ఉన్నాయని ఏపీపీఎస్సీవర్గాలు పేర్కొంటున్నాయి.అందువల్లే సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి ప్రస్తుతానికి ఓ నోటిఫి కేషన్ విషయంలో రూల్-7ను అమలు చేసి, తరువాత దాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరాయి.

ఈ సమస్యకు పరిష్కారం లభించేలా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీపీఎస్పీ భావిస్తోంది. గతంలో మాదిరిగా చేయమని, నోటిఫికేషన్లు, రాత పరీక్షలు ఇంచుమించు ఒకే సమయంలో జరిగినా ఫలితాల్ని మాత్రం తగిన సమయంలోనే వెల్లడిస్తామని పెద్ద ఉద్యోగాల నియామకాల్ని చేపట్టిన తర్వాతనే ప్రాధాన్య క్రమంలో ఇతర ఉద్యోగాల భర్తీని చేపడతామని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ తెలిపారు. అందులో భాగంగా తొలుత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనున్నారు.ఆ తర్వాతనే గ్రూప్-2, 3 ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నారు. ఇలా వచ్చే ఏడాది జూన్ వరకు పరీక్షలు జరిపేలా కార్యాచరణ రూపొందించాల్సి వస్తోందని భావిస్తున్నారు. గ్రూప్-2 పరీక్షకు కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించడానికే ఏపీపీఎస్పీ కట్టుబడి ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే తొలుత ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply