జగన్ చెప్తే తెరాస సర్కార్ చేసిందా?

  araku mp kothapalli geetha land take kcr
తెరాస,వైసీపీ ల మధ్య లోపాయికారీ అవగాహన ఉందని టీడీపీ ఆరోపించడం సర్వసాధారణ అంశం అయిపోయింది.ఇప్పుడు ఓ ఎంపీ …అది కూడా వైసీపీ తరుపున గెలిచిన ఎంపీ అదే ఆరోపణ చేస్తున్నట్టు తెలుస్తోంది.అరకు ఎంపీ కొత్తపల్లి గీత తెలిసినవాళ్లందరి దగ్గర ఇదే మాట చెపుతున్నారట.ఇటీవల ఎంపీ కుటుంబం ఆధీనంలో వున్న భూముల్ని తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ వివాదాస్పద భూములకి సంబంధించి కెసిఆర్ సర్కార్ ఇంత కఠిన నిర్ణయం తీసుకోడానికి జగన్ ప్రోద్భలమే కారణమని ఆమె వాదిస్తున్నారట.

వైస్ హయాంలో గీత కుటుంబం భారీగా లబ్ది పొందిందట.ఆర్ధికంగా బలమైన వాళ్ళని గీతకి జగన్ అరకు ఎంపీ టికెట్ ఇచ్చారు.ఉత్తరాంధ్ర లో వైసీపీ గెలిచిన ఎంపీ స్థానం అదొక్కటే.. కానీ గెలిచిన వెంటనే ఆమె కులం గురించి వివాదం రేగింది.అది తేలక ముందే ఆమె టీడీపీ తో సన్నిహితంగా వ్యవహరించడం ప్రారంభించారు. దీంతో తిక్క రేగిన జగన్ అదను చూసి తెరాస ని ప్రభావితం చేసి తమను దెబ్బ కొట్టారని గీత భావిస్తున్నారు.కోల్పోయిన భూమి మార్కెట్ విలువ వందల కోట్లలో ఉండొచ్చని తెలుస్తోంది.కానీ ఇదే ఆరోపణ బయటికి చేస్తే ..కెసిఆర్ ఆగ్రహిస్తే ఆ భూమి ఎప్పటికీ దక్కదని గీత ఆందోళన .అందుకే ప్రెస్ మీట్ లో ఆమె కెసిఆర్ ని న్యాయం చేయమని అర్ధించారు.లోపల్లోపల జగన్ పై రగిలిపోతున్నారు.

SHARE