ట్యాంపరింగ్ కు పది సూత్రాలు

0
371
aravind kejriwal tampering techniques

Posted [relativedate]

aravind kejriwal tampering techniquesఅరవింద్ కేజ్రీవాల్.. సామాన్యుడిగా పార్టీ పెట్టి చీపురుతో ఢిల్లీని ఊడ్చేసి సంచలనం సృష్టించారు. సీఎం కేజ్రీవాల్.. దుందుడుకు నిర్ణయాలు, ఏకపక్ష వైఖరితో ఢిల్లీ ప్రజలకు విద్యుత్తు సమస్య తెచ్చిపెట్టారు. దేశ రాజధానిలో గంటల తరబడి విద్యుత్ కోతకు కారణమయ్యారు. ఆప్ అధినేత కేజ్రీవాల్.. ఆకాశంలో మబ్బులు చేసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నట్లుగా.. పంజాబ్, గోవా.. ఇలా ఇతర రాష్ట్రాల్లో పాగా వేయాలన్న పిచ్చితో.. సొంత రాష్ట్రం ఢిల్లీకి తగిన న్యాయం చేయడంలో విఫలమవుతున్నారు. ఇప్పుడు తానో జాతీయ నాయకుడిగా చెప్పుకుంటున్న కేజ్రీవాల్.. ఈవీఎంల గురించి కూడా తేడాగా మాట్లాడి మరోసారి బుక్కైపోయారు.

కేజ్రీవాల్ సీఎంగా ఎన్నికైన ఢిల్లీలో మొత్తం అసెంబ్లీ సీట్లు 70. ఆయన పార్టీ ఏకంగా 67 సీట్లు గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ హిస్టరీలో ఈ స్థాయిలో సీట్లు ఎవరికీ రాలేదు. కానీ ఆ రోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈవీఎంలను నిందించలేదు. అప్పుడు కేజ్రీవాల్ కూడా తనకు ఊహకు అందని విధంగా సీట్లెందుకు వచ్చాయి అని ఎంక్వైరీ చేయలేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్సైంది. యూపీలో బీజేపీకి భారీ మెజార్టీ వచ్చిందో లేదో.. అదే కేజ్రీవాల్ ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చని వాదిస్తున్నారు. ఓ ఐఐటీ స్టూడెంట్ గా ఈవీఎం ట్యాంపరింగ్ కు పది మార్గాలు చెబుతానంటున్నారు.

ఈవీఎంలను అనుమానించడం పరిణతి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం కాదని కేజ్రీకి తెలియదా..? అన్నీ తెలిసీ ఇలా ఎందుకు చేస్తున్నారంటే.. పబ్లిసిటీ పిచ్చి అనే అనుకోవాల్సి వస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ నిపుణుడ్ని అని చెప్పుకుంటున్న కేజ్రీవాల్.. ఇదే రకంగా ట్యాంపరింగ్ చేసి ఢిల్లీ ఎన్నికల్లో గెలిచారేమోనని కొత్త అనుమానాలు వస్తున్నాయి. అసలు రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ లెక్కన ఆప్ దెబ్బకు ప్రధాన పార్టీలు ఠా అనాల్సిందే. కానీ కేజ్రీవాల్ కు ఇప్పుడో అనుమానం వచ్చంది. తన సీక్రెట్ మోడీ పట్టేశారేమోనని సందేహం మొదలైంది. అందుకే ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అంటూ అర్థం లేని వాదన చేస్తున్నారు.

Leave a Reply