‘సాహో’కు చరణ్‌ విలన్‌ ఫిక్స్‌

0
486
aravind swamy to do villain role in prabhas saaho movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

aravind swamy to do villain role in prabhas saaho movie
ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయి హీరో అయ్యాడు. ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి 2’ చిత్రం వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధించింది. ఏ భారతీయ సినిమా ఇప్పటి వరకు సాధించలేని కలెక్షన్స్‌ను రాబట్టిన ప్రభాస్‌ తర్వాత సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ప్రభాస్‌ తర్వాత సినిమా ‘సాహో’ అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సుజీత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే టీజర్‌ కూడా వచ్చి అంచనాలను పెంచేసింది. ఈ సమయంలో ఈ సినిమాలో హీరోయిన్‌, విలన్‌ ఎవరు అనే అంశంపై జాతీయ మీడియాలో సైతం ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఈలోపు హీరోయిన్‌, విలన్‌ ఎంపిక పూర్తి చేయనున్నారు. మొదట ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ నటులను అనుకున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్‌ చరణ్‌ ‘ధృవ’ చిత్రంలో విలన్‌గా నటించిన అరవింద్‌ స్వామిని విలన్‌గా ఎంపిక చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ధృవ సినిమాలో అరవింద్‌ స్వామి విలన్‌గా అద్బుతంగా నటించి మెప్పించాడు. ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యాడు. ఈ సినిమాలో కూడా స్టైలిష్‌ విలన్‌ కావాల్సి ఉంది. అందుకే అరవింద్‌ స్వామిని ఎంపిక చేయాలని నిర్ణయించారు. మరి అరవింద్‌ స్వామి ఎలా స్పందిస్తాడు అనేది చూడాల్సి ఉంది.

Leave a Reply