అర్ధనారి రివ్యూ..

215

  ardhanari movie reviewఅర్ధనారి రివ్యూ..

అర్ధనారి – ఎమోషనల్ డ్రామా (భాధ్యత నేర్పించే ప్రయత్నం
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : భానుశంకర్ చౌదరి

నిర్మాత : ఎమ్. రవికుమార్

సంగీతం : రవివర్మ

నటీనటులు : అర్జున్ యజత్, మౌర్యాని

దేశం సమాజం భాద్యత ఈ పదాలు విని చాలా రోజులు అయ్యింది. మనం మసిలేది మంచి చెడు నేర్చుకునేది ఈ సమాజం నుండే. ఎవరు విభేధించిన మన ప్రవర్తన పరివర్తన సమాజం పై ,ఇతరుల ప్రవర్తన మనపై అంతో ఇంతో ప్రభావం చూపుతుంది.ఇదే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అర్ధనారి. బాధ్యత లేనివాడికి భార‌త‌దేశంలో బ్రతికే హ‌క్కు లేదు అని చెప్పడానికి ద‌ర్శకుడు భానుశంక‌ర్ చేసిన ప్రయ‌త్నమే ఈ సినిమా ఎమ్.రవికుమార్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు.అర్ధనారి మరి ఆడియన్స్ ను ఏ మేర ఆలోచింపచేసిందో తెలుసుకోవాలి అంటే కధ లోకి వెళ్లి తెలుసుకోవలసిందే

కధ

హిజ్రాను మెయిన్ థీమ్ గా తీసుకొని దేశభక్తి నేపథ్యంలో తీసిన ఈ సినిమాలో హిజ్రా అయిన అర్ధనారి వరుస హత్యలు చేస్తాడు. ఇందులో జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, జడ్జి, పోలీసులు వంటి ప్రముఖులు వుంటారు. ఓ క్లూ ఆధారంగా పోలీసులు అర్ధనారియే ఈ హత్యలు చేస్తున్నాడని తెలుసుకుని అరెస్ట్ చేస్తారు. అర్ధనారికి కోర్టు ఉరిశిక్ష వేస్తుంది. తన చివరి కోరికగా తెలుగు ప్రజలతో మాట్లాడలనే కోరకను తెలియజేస్తాడు అర్ధనారి. ఈ క్రమంలోనే తాను ఎలా హిజ్రాగ మారాడో,దేశభక్తుడైన తాను హంతకుడిగా ఎందుకు మారవలసి వచ్చిందో కారణాలు చెప్పుతాడు.ఇంతకీ ఆ కారణాలు ఏంటీ ? అసలు అర్ధనారి ఎవరు ? ప్రముఖులనే ఎందుకు చంపుతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ అర్ధనారి

నటీనటుల ప్రతిభ

అర్జున్ అర్ధనారి పాత్రలో చాలా బాగా మెప్పించాడు.ఫస్ట్ హాఫ్ లో హిజ్రా లా,సెకెండ్ హాఫ్ లో మగవాడి గా నటించి ఆకట్టుకున్నాడు.గెటప్, బాడి లాంగ్వెంజ్ కూడ పాత్రకు తగ్గట్టు మలుచుకోని సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యాడు. ఎమోషన్స్ ను ఫర్పెక్ట్ పండించాడు.ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మొత్తం తానై సినిమాను నడిపించాడు.హీరోయిన్ మౌర్య కూడ తన పాత్రకు తగ్గట్టు సూపర్ ఫర్ఫామెన్స్ ఇచ్చింది.ముఖ్యంగా హీరోయిన్ చనిపోయేముందు వచ్చే ఎపిసోడ్స్ లో చాలా బాగా నటించింది.ఇక మిగిలిన వారు కూడ తమ తమ పరిధి మేర బాగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

ముందుగా చెప్పుకోవాల్సింది ద‌ర్శకుడు భానుశంక‌ర్ గురించి గ‌తంలో రెండు సినిమాల‌ను డైరెక్ట్ చేసిన భానుశంక‌ర్ వాటికి భిన్నంగా ఈసారి ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో రాసుకున్న క‌థే అర్ధనారి.మంచి చేయ్యాలి అనే ఉద్దేశం ఉంటే చాలు ఆ పని ఎలాగైన చేయవచ్చు అని చెప్పే ప్రయత్నమే సూటి గా సుత్తి లేకుండా చేసాడు. హిజ్రా నేపధ్యం లో ఎన్నో డబ్బింగ్ సినిమాలను చూసాం. వాటికి భిన్నం గా హిజ్రా నేపధ్యానికి దేశభక్తిని జోడించి హిజ్రాను సూచించే టైటిల్ తోనే సినిమా తీసాడు.సినిమాని ప్రారంభం నుంచే హత్యలతో ప్రారంభించాడు.వరుస హత్యలతో ఆడియన్స్ లో క్యూరియాసిటి పెంచాడు.సెకెండ్ హాఫ్ లో ఎమోషన్స్ ని బాగా చేసాడు.అటు ఫ్యామిలి ఇటు దేశభక్తి రెండిటిని పండించి ఆకట్టుకున్నాడు. రవి వర్మ పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ సన్నివేశాల్ని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి కూడా బాగుంది. నివాస్ డైలాగ్స్ బాగున్నాయి. ఎమోషనల్ డైలాగ్స్ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. పంచ సూత్రాల గురించి బాగానే చెప్పాడు. నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

మంచి

మాస్ అప్పీల్
హిజ్రా గెటప్
హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్
డైలాగ్స్

చెడు

లాజిక్ మిస్ అవ్వటం
రన్ టైమ్
ఓవర్ ఎమోషన్స్

చివరి మాట

బాధ్యత లేని వాడికి భారతదేశంలో బతికే హక్కు లేదని దర్శకుడు ముందు నుంచి చెప్పినట్టుగానే.. ఈ తరహా చిత్రాల్ని ఇష్టపడేవారు బాగా కనెక్ట్ అవుతారు. ట్రై వన్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here