మీరు ఐటీ ఉద్యోగా.. మీ జుట్టు భద్రం..

Posted November 4, 2016
  • are u a software engineer then keep your hair safe హైపర్ టెన్షన్ బట్టతల వస్తుందని అధ్యయనం

మీ ఐటీ ఉద్యోగిగా చేస్తున్నారా.. అయితే మీ జుట్టు పని ఒత్తిడి వల్ల ఊడిపోవడం కాయమంటున్నారు నిపుణులు.. అది క్రమంగా జట్టు ఊడిపోయి బట్టతలకు దారితీస్తుందని తేల్చుతున్నారు.. ఈ పరిస్థితులకు జీన్స్‌ సహా జీవక్రియ కారణాలతోనే జరుగుతుంది కాని ఐటీ ఉద్యోగుల్లో ఈ సమస్యకు మాత్రం ప్రత్యేక కారణం ఉందని ఓ అధ్యయనం తేల్చింది. జట్టు రాలే సమస్యతో బాధపడుతున్న ఐటీ ప్రొఫెషనల్స్‌లో 75శాతం మంది అధికరక్తపోటు (హైపర్‌టెన్షన్‌)తో బాధపడుతున్నారని హెయిర్‌లైన్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ సంస్థ తమ అధ్యయనంలో పేర్కొంది.

are u a software engineer then keep your hair safe బెంగళూరులో ఆగస్టు 2014-జూలై2016 మధ్య కాలంలో 1000మంది హెయిర్‌లాస్‌ పేషంట్లపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. వీరిలో 25-35 ఏళ్ల మధ్య వయస్కుల్లో 85శాతం అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు  తేల్చింది. అయితే ఇందులో 75శాతం ఐటీ ప్రొఫెషనల్సే ఉన్నారని ఆ సంస్థ పేర్కొనడం విశేషం.
are u a software engineer then keep your hair safeపనిని ఉల్లాసంగా చేసేవారికి ఇటువంటి సమస్యల బారిన పడరని.. అందుకే పనిని ఎంజాయ్‌ చేస్తూ ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐటీలో డెవలప్‌మెంట్‌ వైపు ఉన్నవారు ఈ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మిగతా వారికి ఆఫీసు దాటితే అక్కడి పని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదని.. డెవలప్‌మెంట్‌ విభాగంలో ఉండేవారు ఇంటికి వచ్చినా నిత్యం అదే ధ్యాసలో ఉండాల్సి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ విభాగంలో ఉండేవారు కొంచెం ఇష్టపడుతూ పనిచేస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు.
 
3 Attachments
SHARE