అందరికీ శకునం చెప్పి.. కుడితిలో పడ్డ కేజ్రీవాల్..

79

Posted [relativedate]

Arvind Kejriwal Ram Jethmalani feeసామాన్యుడికి తానే అసలైన ప్రతినిధిని అని చెప్పుకునే కేజ్రీవాల్.. ఇప్పుడు సొంత కేసులకు ప్రజాధనం వాడాలని చూస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఢిల్లీ సీఎంగా అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతున్న కేజ్రీ.. వివాదాల్ని కొనితెచ్చుకోవడంలో అందరు సీఎంల కంటే ముందే ఉన్నారు. ఢిల్లీ సీఎం ఆఫీస్ పై సీబీఐ దాడులపై రచ్చ చేసిన కేజ్రీవాల్.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. పరువు నష్టం కేసు వేయించుకున్నారు. పరువు నష్టం కేసు నుంచి తప్పించుకోవడానికి కేజ్రీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు కేసు విచారించాలని కోర్టు ఆదేశించడంతో.. కేజ్రీవాల్ ఎరక్కపోయి అన్నాను.. ఇరుక్కుపోయాను అని స్వగతంలో పాడుకుంటున్నారు. కేసు గెలవడం, ఓడటం సంగతి అలా ఉంచితే.. కేజ్రీ లాయర్ రాంజెఠ్మలానీ ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. ఓసారి కోర్టుకు హాజరైతేనే.. 22 లక్షల ఫీజు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు జెఠ్మలానీ. ఇప్పటికే లాయర్ ఖర్చులు 3కోట్ల 42 లక్షలకు చేరుకున్నాయి. మరోవైపు ఈ బిల్లు కేజ్రీవాల్ చెల్లించకుండా ప్రభుత్వ ఖజానా నుంచి పే చేయడానికి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాపత్రయపడుతున్నారు.

న్యాయశాఖ చూస్తున్న మనీష్ సిసోడియా.. కేజ్రీ కేసు ఢిల్లీ ప్రభుత్వ విధానాన్ని మీడియా ద్వారా చెప్పినందుకే వచ్చిందని, కాబట్టి ఖజానా నుంచే చెల్లించాలని ఫైలుపై నోట్ రాశారట. ఈ విషయం వైరల్ కావడంతో.. నెటిజన్లు కేజ్రీ సర్కారుపై మండిపడుతున్నారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం వివాదాలు కొనితెచ్చుకుని.. కేసులు వస్తే.. ఆ బిల్లులు జనంపై రుద్దడమేంటని మండిపడుతున్నారు. ఢిల్లీ సీఎంగా అన్నీ కేంద్రం చెప్పినట్లే చేయాల్సి వస్తుందని చెబుతున్న కేజ్రీవాల్.. ఈ ఖర్చులు కూడా మోడీకి చెప్పే జనంపై వేస్తున్నారా అని సైటైర్లు కూడా పడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ముందు ఇలాంటి పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here