కాడు రమ్మంటున్నా కామ పైత్యం .. నోటిగుల తో ఆశారాం ..

Posted September 26, 2016

 asaram bapu tihar jail
నిండా మునిగినవాడికి చలేంటి అన్నట్టుంది కామ స్వామి ఆశారాం బాపు పరిస్థితి.ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో తీహార్ జైలు జీవితం..చక్రాల కుర్చీ నుంచి కదలడానికి సహకరించని ఆరోగ్యం….ఓ విధంగా చెప్పాలంటే వూరు పొమ్మంటోంది..కాడు రమ్మంటోంది అన్నట్టుంది వ్యవహారం .ఒకప్పుడు ఆధ్యాత్మిక గురువుగా భావించి దండం పెట్టినవాళ్ళే ..అయ్యగారి శృంగార లీలలు తెలిసి ఛీత్కరించుకుంటున్నారు.అయినా ఆశారాం లో ఆ ఆశలు చావనట్టుంది.

బాపు బెయిల్ పిటీషన్ విచారణ సందర్భంగా అయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక అవసరమైంది.అందుకోసం చక్రాల కుర్చీలో ఆయన్ను ఎయిమ్స్ కి పరీక్షల కోసం తీసుకొచ్చారు.ఇంకేముంది స్వామి గారి వాచాలత్వం మరోసారి బయటపడింది.ఆరోగ్య పరీక్షలకి సహకరిస్తున్న ఓ నర్సుని …నీ శరీరం వెన్నపూస లాగుంది ..నీ బుగ్గలు ఆపిల్ పండ్లలా వున్నాయి ..అంటూ ఆశారాం నోటిగుల చూపించాడు.అంతటితో ఆగకుండా నన్ను కుర్రోడిగా మార్చే వైద్యం ఏదైనా చేయమని డాక్టర్ ని అడిగాడట.ఇవన్నీ చూస్తుంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గానీ పోవన్న సామెత గుర్తొస్తోంది .

SHARE