అశోక్ బాబుకు వ్యతిరేకంగా వేరుకుంపటి

0
371
ashok babu seperated from party

Posted [relativedate]

ashok babu seperated from party
ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబుకు వ్యతిరేకంగా పోరు మొదలైంది. ఆయనకు వ్యతిరేకంగా కొత్త ఉద్యోగుల సంఘం ఆవిర్భవించనుంది. రెవెన్యూ సర్వీసుల అధ్యక్షుడు బొప్పరాజు వెంక‌టేశ్వ‌ర్లు ఈ కొత్త జేఏసీకి నాయకత్వం వహించనున్నారు.

సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అశోక్ బాబు… కాంగ్రెస్ కు ఏజెంట్ అనే విమర్శలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆయన మారిపోయారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. ఉద్యోగులకు అండగా ఉంటున్న చంద్రబాబుకు… అశోక్ బాబు మాత్రం పెద్దగా మద్దతు తెలపలేదు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగులను ఏకం చేయలేకపోయారు. చివరకు ఏపీ ప్రభుత్వమే చొరవచూపి ఎంప్లాయిస్ ను కలుపుకొని వెళ్లింది. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన అశోక్ బాబు.. ఆ విషయమే మరిచిపోయి… పదవిని మాత్రం ఎంజాయ్ చేశారన్న వాదన ఉంది.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు కూడా ఒకటి రెండు సార్లు అశోక్ బాబుకు చెప్పారట. ఉద్యోగుల సంఘం నేతగా … పద్ధతి మార్చుకోవాలని సూచించారట. ఆ తర్వాత కూడా ఆయన మారలేదు. చివరకు ఉద్యోగులే అశోక్ బాబు తీరుతో విసిగిపోయి కొత్త సంఘం పెట్టుకునే దాకా విషయం వెళ్లింది. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌ల వ‌ల్లే ప‌రిస్థితి ఇక్క‌డికి దాకా వ‌చ్చింద‌ని ఉద్యోగ‌సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు దాదాపు 40 సంఘాల ఉద్యోగులు ఏకమయ్యారు. కొత్త జేఏసీని ఏర్పాటు చేసుకోబోతున్నారు. అశోక్ బాబుకు వ్యతిరేకంగా రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంక‌టేశ్వ‌ర్లు ఈ జేఏసీకి లీడర్ గా ఎన్నికవ్వనున్నారు. కొత్త ఉద్యోగుల జేఏసీపై అశోక్ బాబు మాత్రం మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కొత్త జేఏసీకి అంత‌సీన్ లేదంటూ లైట్ తీసుకుంటున్నారు. మ‌రి ఈ ఉద్యోగుల జేఏసీ లొల్లి ఎక్క‌డికి వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Leave a Reply