రాజుగారి కోపం…ముంబైలో ఇక నో విమానం?

0
423
ashok gajapathi raju fires on shiv sena mp ananth geethe

Posted [relativedate]

ashok gajapathi raju fires on shiv sena mp ananth geethe
అది లోక్ సభ…దేశప్రజలంతా తమని పాలించడానికి ఎన్నుకున్న వారిని కొలువుదీర్చిన చోటు. అక్కడ కూర్చున్నా కొందరిలో పాతవాసనలు పోవు.అందుకే ఇటీవల రవీంద్ర గైక్వాయిడ్ అనే ఓ శివసేన ఎంపీ రెచ్చిపోయి ఎయిర్ ఇండియా ఉద్యోగిపై చెప్పుతో దాడి చేసాడు.అందుకే ఆయనపై ఎయిర్ ఇండియా నిషేధం విధించింది.ఆ నిషేధం గురించి లోక్ సభలో ఆ పార్టీ ఎంపీలు లేవనెత్తారు. ఎయిర్ ఇండియా నిర్ణయంలో కలగజేసుకోవాలని శివసేన ఎంపీ అనంత్ గీతే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజుని కోరారు.అందుకు మంత్రి నిరాకరించడంతో గీతే సహా శివసేన ఎంపీ లు ఒక్కసారిగా రెచ్చిపోయారు.నోటికి వచ్చింది మాట్లాడుతూ మంత్రి మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో సహచర ఎంపీ లు అలెర్ట్ అయ్యి రాజుగారికి కవచంలా నిలవడంతో పెద్ద ఇబ్బంది తప్పింది.

ఈ పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని అశోక గజపతి రాజు కూడా శివసేన ఎంపీ ల వైఖరి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో శివసేన ఎంపీ లు ఇంకాస్త రెచ్చిపోయి మాట్లాడారు.లోక్ సభ సాక్షిగా అందరూ వింటుండగానే ఇక ముంబైలో ఒక్క విమానమైనా ఎలా ఎగురుతుందో చూస్తామంటూ అనంత్ గీతే హెచ్చరిక చేశారు.ఆ హెచ్చరికలు వీధిపోరాటంలో నోటిదూలకి ఏ మాత్రం తక్కువ కాదు.అయినా ఇంత గోల చేస్తున్న శివసేన ఒక్క విషయాన్ని మర్చిపోయినట్టుంది.అదేమిటంటే …ఇప్పటికే విమానం ఎక్కలేక రవీంద్ర గైక్వాయిడ్ నానా ఇబ్బందులు పడుతుంటే ..శివసేన వాళ్ళు ముంబైలో మొత్తం విమానాలు ఆపితే మరాఠీలు ఇంకెంత ఇబ్బంది పడుతారు ?

Leave a Reply