అలా చేస్తే అసెంబ్లీ ఖాళీ కాదా ?

ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మీద సాక్షి తాజా అస్త్రం ప్రయోగించింది.అది ఓ టీవీ ఇంటర్వ్యూ  లో ఎన్నికల ఖర్చు మీద వ్యాఖ్యానిస్తూ పోయిన తనకు అయిన ఖర్చు అక్షరాలా 11.5 కోట్లని తేల్చారు.విన్న వాళ్లకి అదేం షాక్ అనిపించలేదు.అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన నాయకులు అసెంబ్లీలో ఎంతో మంది…వారిలో ఈ పార్టీ…ఆ పార్టీ అని తేడాలేదు.ఎంత నిజమైతే మాత్రం అలా బయటకు చెప్పేస్తారా?కోడెల చెప్పేశారు …దీంతో ఆయనపై ఎన్నికల సంఘం చర్య తీసుకోవాలని YSR CP డిమాండ్ చేసింది.ఆ డిమాండ్ కు ఎన్నికల కమీషన్ పచ్చజెండా  ఊపితే ..అలాంటి నేతలందరి మీద చర్య తీసుకుంటే ఏమవుతుంది?అసెంబ్లీ ఖాళీ  కాదంటారా ?ఏదేమైనా స్పీకర్ కోడెల మీద ఎన్నో అస్త్రాలు ప్రయోగించిన YSR CP కి  మరో ఆయుధం మాత్రం దొరికింది…అది పనిచేస్తుందో లేక పనికిరాకుండాపోతుందో చూద్దాం!

assembly empty

Leave a Reply