Posted [relativedate]
తెలంగాణ రాష్ట్ర ప్రభత్వ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపధ్యంలో తెలంగాణ ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వం లో మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ నిర్వహించనున్నారు ప్రతిపక్షాల వాదనలతో సంబంధం లేకుండా ప్రభుత్వ విజయాలు ప్రజలకోసం చేస్తున్న అభివృద్ధి పనుల మీద ప్రధానం గా ప్రెసెంటేషన్ ఇవ్వాలని సూచిస్తారట. మొత్తం గా శీతాకాల సమావేశాలను అర్ధవంతం గా నిర్వహించి ప్రతి పక్షాలను అడ్డుకోనేలా వ్యూహం రచించారు.ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చిన సందర్భం లో వారిని సస్పెండ్ చేయాలి అనే ఆలోచనలో కూడా సర్కార్ ఉంది. రేపు అస్సెంబ్లీలోఅధికార పార్టీ సభ్యులు వ్యవహర శైలి ,చర్చకువచ్చే అంశాలైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణ మాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు వీటి మీద కసరత్తు చేయనున్నారు. నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి, నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకున్న చొరవ తదితర అంశాలనూ భేటీలో సీఎం తమ సభ్యులకు చెప్తారు.
ఇదిలా ఉండగా ప్రతిపక్ష టీడీపీ కాంగ్రెస్ బీజేపీ తదితర పార్టీ లు ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టాలనే వ్యూహరచనలో ఉంది.కనీసం 20 రోజులైనా చర్చ జరగాలని టీడీపీ అంటోంది.ఇక కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు కూడా ఇలానే వున్నాయి మొత్తం గా ప్రతిపక్ష పార్టీ లన్ని ఏకతాటి పైకి వచ్చి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే వాతావరణం కనిపిస్తోంది , రాజ్య సభ ,లోక్ సభ సమావేశాలు వాయిదాలు పడుతూ చివరి దశకు వచ్చాయి అదే సంప్రదాయం ఎక్కడ కూడా కొనసాగుతుందేమో రేపటికి కానీ తెలియదు…ప్రజా సమస్యల పేరుతో ప్రతిపక్షాలు , సభ జరగ నివ్వటం లేదని అధికార పక్షం ఇలా ఒకరిపై ఒకరు ఆరోపించుకొంటూ ప్రజాసమస్యల్ని పరిష్కరించ కపోవడం కూడా రాజకీయం లో భాగమే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.