అసెంబ్లీకి వెళ్లనున్న మహేష్‌బాబు

0
765
Assembly Set For Mahesh Babu Bharat Anu Nenu Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో ప్రస్తుతం ‘స్పైడర్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఆ సినిమాను దసరాకు విడుదల చేయబోతున్నారు. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే మహేష్‌బాబు మరో సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు ‘భరత్‌ అను నేను’ అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ చాలా కాలం క్రితమే అయ్యింది. అయితే ‘స్పైడర్‌’ చిత్రం కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

‘భరత్‌ అను నేను’ టైటిల్‌ చూస్తుంటేనే ఇదో పొలిటికల్‌ డ్రామా అనే విషయం అర్థం అవుతుంది. మహేష్‌బాబు గతంలో ‘దూకుడు’ సినిమాలో కొద్ది సమయం రాజకీయ నాయకుడిగా కనిపించాడు. ఇప్పుడు కొరటాల తెరకెక్కించబోతున్న సినిమాలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అదీ ఒక ఎమ్మెల్యేగా కనిపించబోతున్నాడు. ఎమ్మెల్యే అనగానే అసెంబ్లీ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అందుకే ఒక భారీ అసెంబ్లీ సెట్టింగ్‌ను వేస్తున్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఒక ఇండోర్‌ యూనిట్‌లో ఈ అసెంబ్లీ సెట్టింగ్‌ను వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ సెట్టింగ్‌లో దాదాపు 15 రోజుల పాటు చిత్రీకరణ చేయాల్సి ఉందట. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అసెంబ్లీలో జరుగనున్నాయి కనుక భారీగా అసెంబ్లీ సెట్టింగ్‌ను వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply