దక్షిణాది సీఎం లని వణికిస్తున్న జ్యోతిష్కుడు..

5265

Posted [relativedate]

Astro Guru Venu Swamy Prediction On south chief ministers
జ్యోతిష్కులు ఏదో చెప్పడం ..ఇంకేదో అవ్వడం చూస్తూనే వున్నాం …కానీ తెలుగు జ్యోతిష్కుడు ఒకరు ఇటీవల చెప్పిన జోస్యం జయ విషయంలో నిజం కావడంతో దక్షిణాది ముఖ్యమంత్రుల్లో టెన్షన్ మొదలైంది.ఇంతకీ ఆ జ్యోతిష్కుడి పేరు వేణు స్వామి ..అయన చెప్పిన విషయమేమిటంటే సెప్టెంబర్ 30 ,2016 నుంచి 2017 ,సెప్టెంబర్ 30 లోపు దక్షిణాది రాష్ట్రాలకి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు అనారోగ్య సమస్యలతో చనిపోతారు.మరో ముఖ్యమంత్రి తీవ్ర అనారోగ్యంతో పదవి నుంచి దిగాల్సి వస్తుంది. ముఖ్యమంత్రులు చనిపోయిన రాష్ట్రాల్లో రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడతాయి.

ఓ యు ట్యూబ్ ఛానల్ లో ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటల్ని తొలుత ఎవరూ పట్టించుకోలేదు.తర్వాత అంటే జయ మరణం తర్వాత ఆ జ్యోతిష్కుడి ఫేట్ మారినట్టుంది.జయ మరణం తర్వాత ముఖ్యమంత్రుల ప్రాణగండం గురించి చెప్పిన వేణు స్వామి ఫోన్ తెగ మోగుతోందట.మిగిలిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరని అడిగేవారు ఎక్కువైపోయారట.ఈ విషయం ఆనోటా ఈనోటా పడి కొందరు సీఎం ల దగ్గరికి కూడా చేరిందట.పైకి తేలిగ్గా తీసుకున్నా మృత్యువంటే భయం లేకుండా ఎవరికుంటుంది? అందుకే ఒకరిద్దరు సీఎం లు పరిహార మార్గాలు వున్నాయేమోనని అనుచరుల్ని సదరు జ్యోతిష్కుడి దగ్గరకు పంపే ఆలోచన చేస్తున్నారట.చూడాలి ఈ జ్యోతిష్కుడి ఎపిసోడ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో?

[wpdevart_youtube]GeIj90_6NII[/wpdevart_youtube]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here