జయ కి వైద్యాన్ని శాసిస్తున్న జ్యోతిష్కులు?

0
971
Astrologer said jayalalitha health testing only chennai hospital

 Posted [relativedate]

Astrologer said jayalalitha health testing only chennai hospital
20 రోజులకి పైగా చెన్నై అపోలో ఆస్పత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్నారు.ఆమె వైద్యం కోసం దేశవిదేశాల నుంచి ప్రముఖ డాక్టర్స్ ఎంతో మంది వస్తున్నారు.ఒక దశలో వైద్యం కోసం ఆమెని సింగపూర్ తీసుకెళతారని వార్తలు వచ్చాయి.అయితే ఆలా జరగలేదు.దానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతాం.జయకి విదేశాల్లో వైద్యం చేయించడం మంచిది కాదని పోయెస్ గార్డెన్స్ కి దగ్గరవాడైన ఓ జ్యోతిష్కుడు చెప్పడం వల్ల ఎంత ఇబ్బంది అయినా చెన్నై అపోలో లోనే వుంచారట.రాజరికాల్లో రాజుకి ఓ మాట చెప్పి ఒప్పించగలిగే స్థాయి రాజగురువుకి ఉండేది.ఇప్పుడు ఇలాంటి జ్యోతిష్కులు ఆ స్థానాన్ని పొందుతున్నట్టు వుంది.

మరో వైపు అమ్మ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని అన్నాడీఎంకే నేత పొన్ని యెన్ ప్రకటించారు.బ్రిటన్,ఎయిమ్స్ వైద్యులు వారంగా అందిస్తున్న చికిత్సతో మంచి ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది.బ్రిటన్ వైద్యుడు రిచర్డ్ బాలే తో జయ మాట్లాడినట్టు కూడా పొన్ని యెన్ చెప్తున్నారు.బ్రిటన్ ,ఎయిమ్స్ వైద్యులు తిరిగి వెళ్లడంతో జయ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు పార్టీ వర్గాలు చెప్తున్న మాటల మీద ఈ దఫా తమిళుల్లోనూ నమ్మకం కనపడుతోంది.

Leave a Reply