గడ్డుకాలం రాజమౌళికా…ఆ జ్యోతిష్కుడికా ?

0
777
astrologer venu swamy says about rajamouli

Posted [relativedate]

astrologer venu swamy says about rajamouli
వేణుస్వామి…ఈ పేరు ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలు తెలుసుకునే వారు అందరికీ సురపరిచితమే.ఈ జ్యోతిష్కుడు సామాన్యుల జాతకాలు చెప్తాడో లేదో గానీ సెలబ్రిటీ ల గురించి వారు అడక్కుండానే చెప్పేస్తాడు.యూట్యూబ్ ఛానల్ లో పెట్టేస్తాడు.అన్నీ సంచలనాత్మక టాపిక్స్ కి మాత్రమే వేణుస్వామి ఛానల్ లో ప్లేస్ ఉంటుంది.దక్షిణాది ముఖ్యమంత్రుల్లో ఒకరికి ప్రాణగండం ఉంటుందని ఆయన చెప్పినట్టే జయ చనిపోయారని భారీగా ప్రచారం చేసుకున్నాడు.ఇక 2014 లో చంద్రబాబు అధికార పీఠం ఎక్కిన దగ్గర నుంచి ఆయనకి అన్నీ కష్టాలే అని,లోకేష్ వల్ల టీడీపీ పతనం అవుతుందని,బ్రహ్మణికి సీఎం ఛాన్స్ ఉందని,ఎన్టీఆర్ కి సీఎం అయ్యే యోగ్యత ఉందని,2019 లో జగన్ సీఎం అవుతాడని ఇలా ఎన్నో చెప్పేసాడు.కానీ అందులో ఏది నిజమో,ఏది కాదో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి.ఆ వేణు స్వామి దృష్టి ఇప్పుడు దర్శక దిగ్గజం రాజమౌళి మీద పడింది.

రాజమౌళి తీసిన శాంతినివాసం టీవీ సీరియల్ కి తానే ముహూర్తం పెట్టానని చెప్పుకున్న వేణుస్వామి తాజాగా ఓ బాంబు పేల్చాడు.ఈ ఏడాది మే 2 తర్వాత రాజమౌళి జాతకం తిరగబడుతుందట.ఆయన స్టేటస్ వర్మ స్థాయికి పడిపోతుందట.ఏడేళ్ల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని..మళ్లీ రాజమౌళి 2024 తర్వాత పుంజుకుంటాడని వేణుస్వామి జోస్యం.బాహుబలి గురించి నేరుగా చెప్పకుండా రాజమౌళి ఏడేళ్ల పాటు ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చెప్పాడు.అయితే మిగతా జోస్యాలతో పోల్చుకుంటే ఈసారి వేణుస్వామి పెట్టిన డెడ్ లైన్ దగ్గర్లోనే వుంది.అది కూడా బాహుబలి సక్సెస్ తో ముడిపడి వుంది.అందుకే అటుఇటు కాకుండా మాట్లాడి తప్పించుకోడానికి వీల్లేదు.ఈసారి వేణుస్వామి చెప్పినట్టు జరక్కపోతే మాత్రం రాజమౌళి కి గడ్డు కాలం ఏమోగానీ జ్యోతిష్కుడికే ఆ పరిస్థితి ఎదురు కావొచ్చు.

Leave a Reply